ప్లీన‌రీ.. అదే గురి!

  • జులై 8,9వ తేదీల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశాలు 
  • ప్ర‌జా స‌మ‌స్య‌లే పార్టీ ఎజెండా
  • ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాటు దిశ‌గా భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ 
  • నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా ప్లీన‌రీలు విజ‌య‌వంతం
  • మూడేళ్ల టీడీపీ పాల‌న‌పై విస్తృత చ‌ర్చ‌
  • పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేయ‌నున్న అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  
 అమ‌రావ‌తి:  `‘మీరు చూపించిన ప్రేమే నాకు కొండంత ధైర్యం’... ఆ ప్రేమ ఇచ్చిన ధైర్యంతోటే నేను ఆరేళ్ల కిందట పార్టీని స్థాపించా. నాన్న కలలు నెరవేర్చేందుకు ముందుకెళుతున్నా``  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడో వసంతంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్న మాట‌లివి. మరింత వేగంగా ముందుకెళదామని, ప్రతి పేదవాడి కళ్లల్లో సంతోషం చూసే తరుణం మరెంతో దూరంలో లేదని, ఏడాదిలో అందరం ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని వైయ‌స్ జ‌గ‌న్ ధీమా వ్యక్తం చేశారు. 

అంద‌రి నోట ఒకే మాట‌..
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు త్వ‌ర‌లోనే మంచి రోజులు రానున్నాయి. ఇన్నాళ్ల టీడీపీ నేత‌ల పాల‌న‌పై విసిగిపోయిన ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లుగ‌నుంది. ప్ర‌జా ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఆ దిశ‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉధృతం చేసింది. పార్టీ శ్రేణుల‌ను స‌మ‌య‌త్తం చేసేందుకు, మూడేళ్ల‌లో టీడీపీ పాల‌నా తీరును ఇది వ‌ర‌కే నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా ప్లీన‌రీల‌లో విస్తృతంగా చ‌ర్చించ‌గా, అంద‌రి నోట వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావాలి. మ‌ళ్లీ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాలన రావాల‌ని కోరుకున్నారు. ఇక రాష్ట్ర స్థాయి పార్టీ ప్లీన‌రీ జులై 8, 9వ తేదీల్లో నిర్వ‌హించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ సారి ప్లీన‌రీని ఓ పండుగ‌లా నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేశారు. 

వైయ‌స్ఆర్ క‌ల‌లు నెర‌వేర్చేందుకే
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అకాల మ‌ర‌ణం త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి. మ‌హానేత అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లు కాక‌పోవ‌డం, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోవ‌డం వంటి దుశ్చర్య‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. మ‌హానేత మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మృత్యువాత ప‌డ్డ బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తాన‌ని ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట ఇచ్చారు. ఓదార్పు యాత్ర పేరుతో బాధిత కుటుంబాల‌కు భ‌రోసా క‌ల్పిస్తుంటే ఎక్క‌డ ఆయ‌న‌కు మంచి పేరు వ‌స్తోంద‌న‌ని నాడు కాంగ్రెస్ పార్టీ క‌క్ష‌గ‌ట్టింది. కాంగ్రెస్‌కు టీడీపీ తోడు కావ‌డంతో ఆ రెండు పార్టీలు కుట్ర చేసి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అక్ర‌మ కేసుల్లో ఇరికించింది. అయితే ఇవేవి లెక్క చేయ‌కుండా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌య సాధ‌న‌కు మార్చి 12, 2011న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న త‌ల్లి వైయ‌స్ విజ‌య‌మ్మ‌తో ప్రారంభ‌మైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన‌తి కాలంలోనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు చేరువైంది. 2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1.8 శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూర‌మైన ఏమాత్రం నిరుత్సాహ‌ప‌డ‌కుండా ప్ర‌తిప‌క్ష పార్టీగా నిత్యం ప్ర‌జ‌ల వెంటే ఉంది. ప్ర‌తిప‌క్ష నేత‌గా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అటు అసెంబ్లీలో, ఇటు బ‌య‌ట పోరాటం చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతున్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌తిప‌క్ష నేత‌గా వైయ‌స్ జ‌గ‌న్ అవ‌త‌రించారు. రాష్ట్రంలో ఎక్క‌డ, ఏ మూల‌న ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగినా వెంట‌నే నేనున్నాని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధితుల‌కు అండ‌గా నిలిచారు.  

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌..
2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అమ‌లుకు సాధ్యం కాని హామీలు గుప్పించారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా ఇంత‌వ‌ర‌కు ఆయ‌న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌లేదు. సంక్షేమ ప‌థ‌కాలు ఆగిపోయాయి. అర‌కొర‌గా అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు ప‌చ్చ‌నేత‌ల జోబుల్లోకి వెళ్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌తేడాది జులై 8న దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి సంద‌ర్భంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. అధినేత పిలుపు మేర‌కు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్ర‌తి గ్రామానికి వెళ్లి ప్ర‌తి ఇంటిని ద‌ర్శించారు. ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలు తెలుసుకున్నారు. గ్రామంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను గుర్తించారు.  పార్టీ రూపొందించిన ప్ర‌జా బ్యాలెట్ ద్వారా చంద్ర‌బాబు పాల‌న‌కు మార్కులు వేయించారు. ఏ గ్రామంలో కూడా చంద్ర‌బాబు పాల‌న‌కు పాస్ మార్కులు రాలేదు.

నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా ప్లీన‌రీల‌కు విశేష స్పంద‌న‌
ఈ ఏడాది మే చివ‌రి నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ప్లీన‌రీలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అన్ని గ్రామాల నుంచి పార్టీ బూత్ క‌మిటీ స‌భ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నేత‌లు హాజ‌రై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ రూపొందించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయితేనే మ‌న క‌ష్టాలు తీరుతాయ‌ని, ఇందుకోసం పార్టీ నేత‌లు ఏక‌గ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌తి ఒక్క‌రూ సైనికుల్లా ప‌ని చేయాల‌ని తీర్మానించుకున్నారు. అలాగే జిల్లా ప్లీన‌రీలను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ ముఖ్య నేత‌లు జిల్లా ప్లీన‌రీల‌లో పాల్గొని ఆధినేత పంపిన సందేశాన్ని వినిపించి పార్టీ శ్రేణుల‌ను కార్యోణ్ములను చేశారు. నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా ప్లీన‌రీల‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర ప్లీన‌రీ కూడా విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో నిర్వ‌హించే త‌దుప‌రి ప్లీన‌రీకి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో పాల్గొనాల‌ని తీర్మానించారు. 

ప్ర‌తిష్టాత్మకంగా వైయస్సార్సీపీ జాతీయ ప్లీన‌రీ
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను జులై 8, 9వ తేదీల్లో ప్రతిష్టాత్మంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. గుంటూరు - విజయవాడ మధ్య గల ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఎంపిక చేసిన స్థలంలో ప్లీనరీ సమావేశాలు జరపాల‌ని నిర్ణ‌యించారు. ఇటీవ‌ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  హైద‌రాబాద్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ప్లీనరీ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. టీడీపీ పాలనపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ఎన్నికల వరకూ ప్రభుత్వంపై పోరాటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్లీనరీలో సిద్ధం చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా తీర్మానాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్లీనరీని సమర్థవంతంగా నిర్వహించడానికి వివిధ కమిటీల నియామకంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో  జులై 8, 9వ తేదీల్లో ప్లీన‌రీ స‌మావేశాల‌ను పండుగ‌లా నిర్వ‌హించి ప్ర‌జా ప్ర‌భుత్వ ఏర్పాటుకు భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. పార్టీ శ్రేణుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిశా నిర్దేశం చేయ‌నున్నారు. ప్లీన‌రీ స‌మావేశాల‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
Back to Top