పర్యటనతో మారిన చిత్రం

వరంగల్ లో నాలుగు రోజుల పాటు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన పర్యటనతో ఓరుగల్లు ముఖచిత్రం మారిపోయింది. ప్రజల మనస్సుని చూరగొన్న నాయకుడిగా ప్రజల్లో ఆయన నిలిచిపోయారు.

తెలంగాణ లో వరంగల్ ఉపఎన్నికలకు నగారా మోగినప్పుడు రాజకీయ ముఖచిత్రం ఒక విధంగా ఉండేది. ప్రజల్లో ఎటువంటి భావనలు ఉన్నాయి అనే దాని మీద చర్చ జరిగేది కానీ, ఈ లోగా వైఎస్సాసీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు సమావేశం కావటం, అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్ ను అధ్యక్షులు వైఎస్ జగన్ అంగీకారం మేరకు ప్రకటించటం చక చకా జరిగిపోయాయి. దీంతో తెలంగాణలో  ప్రచార పర్వంలోకి వైఎస్సార్సీపీ నాయకులు బరిలోకి దిగారు.

ఒక్కో పల్లెలో ప్రచారం చేస్తుంటే రాజన్న మీద అభిమానం అడుగడుగునా బయట పడింది. పార్టీ అభ్యర్థి సూర్యప్రకాష్ ను వెంటబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహర్నిశలు ప్రచారం చేశారు. ఈలోగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే రోజా విరివిగా పర్యటించి ప్రత్యర్థి పార్టీలను బెంబేలెత్తించారు.

తర్వాత పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఓరుగల్లు గడ్డ మీద ప్రచారానికి అడుగు పెట్టారు. దివంగత రాజన్న పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు ఏమిటి, ఇప్పటి ప్రభుత్వాల వైఫల్యాలు ఏమిటి అనేది పూసగుచ్చినట్లుగా వివరించారు. చాలా సూటిగా ప్రత్యర్థి పార్టీల వైఫల్యాల్ని విడమరిచి చెబుతుండటంతో పాటుగా రాజన్న తనయుడు తమ ముంగిటకు వచ్చి నిలవటంతో ప్రజల్లో అభిమానం వెల్లువెత్తింది. పర్యటన జరిగిన ప్రతీ పల్లెలో ఫ్యాన్ జెండా రెప రెపలాడింది. రాజన్న రాజ్యం కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్న జగన్ పిలుపు ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తించింది.
Back to Top