ఫేక్‌ సర్వేలతో అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి

ఇప్పటి వరకు  ఏపీలో ఎలాంటి సర్వే నిర్వహించలేదు

మా సంస్థ పేరును అక్రమంగా ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై చర్యలు తీసుకుంటాం

లోక్‌నీతి సీఎస్‌డీఎస్‌ సర్వే సంస్థ వెల్లడి

 అమరావతి: ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి అధికార టీడీపీ ఎలా దొడ్డిదారిన వెళ్తుందో మరోసారి స్పష్టమైంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఫేక్‌ సర్వేలను తన అనుకూల మీడియాతో ప్రచారం చేసుకుంటోంది. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్‌నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి సర్వే సంస్థ తీవ్రంగా స్పందించింది. తాము ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన సర్వే ఫేక్‌ అని తేల్చిచెప్పింది.

తమ అనుమతి లేకుండా సంస్థ పేరును అక్రమంగా ప్రచురించింనందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ ప్రకటించింది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వేను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ కథనానికి తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబు, తన ఎల్లో మీడియా అసత్య ప్రచారం మరోసారి బట్టబయలైంది. వైయ‌స్ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై బురదజల్లే విధంగా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికలు కథనాలను ప్రచురిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఏపీలో టీడీపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటూ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఓటర్లను బెదిరిస్తూ.. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తూ.. మరోవైపు ఇలా పచ్చమీడియాతో ఫేక్‌ సర్వేలను ప్రచురిస్తూ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై ఉ‍న్న వ్యతిరేకతను కప్పిపుచుకునేందుకు అనేక అక్రమాలకు పాల్పడుతూ.. ఫేక్‌ సర్వేలను సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో భారీ ఓటమి తప్పదనే ఇలా పచ్చ పత్రికలతో అసత్య వార్తలను ప్రచురిస్తున్నారు.

 

 

Back to Top