సీఎం ఇలాకలో అక్రమ దందా

క్వారీల్లో విచ్చలవిడిగా తవ్వకాలు
బాబు అండతో చక్రం తిప్పుతున్న తమ్ముళ్లు
పట్టించుకోని అధికారులు..భారీగా అవినీతి

చిత్తూరుః రాష్ట్రంలో పచ్చనేతలు ఆడిందే ఆట పాడిందే పాట అవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని  విచ్చలవిడిగా దందాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయలను స్వాహా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అక్రమ క్వారీల దందా యథేశ్చగా సాగుతోంది. 40 లోపు క్వారీలకు మాత్రమే అనుమతులుండగా, 150 క్వారీలు నడుపుతూ పరిమితికి మించి  తవ్వకాలకు పాల్పడుతున్నారు. 

అడ్డగోలుగా అక్రమాలు..
మూడు రాష్ట్రాల కూడలి కుప్పంలో క్వారీల పేరుతో అధికారపార్టీ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో ఒకే పర్మిట్‌తో  టన్నుల కొద్ది బండరాయిని అక్రమంగా ఇతర  ప్రాంతాలకు తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ  ఖజనాకు భారీగా గండికొడుతున్నారు. తెలుగుదేశం నేతల అక్రమాలపై సొంత పార్టీ వారే ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరవయ్యారు. అంటే  సీఎం ఇలాఖాలో దోపిడీ ఏరకంగా  సాగుతుందో అర్థమవుతోంది.
 
ఇష్టారాజ్యం..
కుప్పానికి చెందిన టీడీపీ నాయుకుడు చంద్రబాబు అండతో క్వారీలో చక్రం తిప్పుతున్నాడు.  జిల్లాలోని  క్వారీ యజమానుల నుంచి గత మూడు నెలల్లో రూ.100 కోట్లు వసూలు చేసినట్టు  సొంత పార్టీ వారే  చెప్పుతున్నారు. దీనిపై పెదబాబు, తనయుడు లోకేష్ లకు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. సదరు నాయకుడికి చంద్రబాబు అండదండలుండడంతో స్థానిక నాయకులు కిమ్మనడం లేదు. 

గాల్లో దీపంలో ప్రాణాలు
క్వారీల్లో పనిచేసే కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. కనీస సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు పాటించే వారు కరువయ్యా రు. రాతి క్వారీల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయినా, వికలాంగులుగా వూరినా నామమాత్రపు పరిహారంతో క్వారీ నిర్వాహకులు చేతులు దులుపుకొంటున్నారు. స్థానికులను పనిలో పెట్టుకుంటే ఇబ్బందులుంటాయని పక్క రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారిలో ఒకరితో మరొకరికి పెద్దగా పరిచయూలు లేకపోవడంతో సహచరులు విగత జీవుతైనా, వికలాంగులైనా ఎవరూ పట్టించుకోవడం లేదు.  కార్మికులకు ఎలాంటి బీమా, ఈఎస్‌ఐ సదుపాయూలు లేవు.

ఇదిగో సాక్ష్యం..
శాంతిపురం వుండలంలోని కోనేరుకుప్పం వద్ద ఉన్న ఓ క్వారీలో మేలో జరిగిన ప్రవూదంలో ఒడిశాలోని బరంపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వుళ్లీ ఇదే క్వారీలో ఈ నెల 24న తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, అదే రాష్ట్రంలోని విల్లుపురానికి చెందిన మరొకరు తీవ్ర గాయూలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. 
Back to Top