జగన్ దీక్షతో పునరేకీకరణ

గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీక్షతో చంద్రబాబు ప్రభుత్వం మనస్సు కరగటం లేదు. పైగా ప్రజల్ని తప్పు దారి పట్టించే విధంగా కుట్రలు మాత్రం బలంగా చేస్తున్నారు. మెడికల్ రిపోర్టుల్ని ట్యాంపరింగ్ చేసి తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపుతున్నారు.

జగన్ దీక్ష కు పూర్తి మద్దతు ప్రకటించిన సీపీఎం, సీపీఐ పార్టీలతో పాటు లోక్ సత్తా, ఎమ్మార్పీఎస్ వంటి ఉద్యమ భావజాల పార్టీలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ కూడా క్రమంగా స్వరం మార్చుకొంటోంది. జగన్ దీక్ష మీద చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఖండించాలని కాంగ్రెస్ తలపోస్తోంది. ఇందుకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత, సీనియర్ నాయకుడు సీ రామచంద్రయ్య చొరవ చూపుతున్నట్లు సమాచారం.

మొత్తం మీద వైెఎస్ జగన్ దీక్షతో ప్రదానమైన రాజకీయ పార్టీలన్నీ ఒక దిశగా కేంద్రీక్రతం అవుతున్నాయి. చంద్రబాబు చేస్తున్నమోసాల్ని ఎండగట్టడంఅనే లక్ష్యంతో పార్టీలు ఒక్క తాటి మీదకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దుర్మార్గ పాలనను దూరం చేసేందుకు ఈ శక్తుల ఏకీకరణ ఒక ప్రధాన వారధి కాబోతోంది. ఈ దిశగా సీనియర్ రాజకీయ నాయకులు ఆలోచనలు ముమ్మరం చేస్తున్నారు. 
Back to Top