ప్రపంచ బ్యాంక్ రిపోర్టు వెనుక నిజాలు..

కొత్త పరిశ్రమలు రాకపోయినా గొప్పలు
15 నెలల్లో వరుసగా  సంస్థల మూసివేత
పది వేల మందికి ఉపాధి గల్లంతు

హైదరాబాద్: ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ కు రెండో ర్యాంక్ వచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ మురిసిపోతోంది. ఇదంతా చంద్రబాబు ఘనత అంటూ కితాబు ఇచ్చుకొంటోంది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాకపోయినా ఇంతటి ఘనత ఎలా వచ్చిందా అన్నది సామాన్యుల సందేహం.

ర్యాంకు కథ ఇది
పెట్టుబడులు పెట్టే వాతావరణం దిశగా సుమారు 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకొన్నట్లు చెబుతున్నారు. భూములు లాక్కోవటం, నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు ఇవ్వటం, పర్యావరణ అంశాల్ని పట్టించుకోక పోవటం, కార్మిక చట్టాల్ని అణచి వేయటం వంటి అంశాల్ని పరిశీలించినట్లు సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థల్ని అడ్డగెోలుగా మార్చేయటం అన్న మాట.

ఇదిగో మూత బడిన జాబితా
కొత్తగా పరిశ్రమలు రాకపోవటం మాట దేవుడు ఎరుగు. ఉన్న పరిశ్రమలు మాత్రం మూతపడుతున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నవ్య, శ్రీ లక్ష్మి శ్రినివాస, జ్యతి జ్యూట్ మిల్లులు మూత పడ్డాయి. గుంటూరులోని భజరంగ్ జ్యూట్ మిల్లు మూతపడింది. విజయనగరం జిల్లాలోని జిందాల్ స్టీల్ కర్మాగారం కూడా తాజాగా మూతపడింది. మొత్తం మీద పది వేల మంది దాకా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.

వాస్తవం ఇది..
ఒక వైపు పరిశ్రమలు సంక్షోభంలో కూరుకొని పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు సర్కారే స్వయంగా చొరవ తీసుకొని చిత్తూరు డెయిరీ వంటి సహకార సంస్థల్ని మూత వేయించటం అందరికీ తెలిసిందే. అటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు ఒక్క కొత్త పరిశ్రమ తెప్పించక పోయినా, ప్రపంచ బ్యాంక్ నుంచి నివేదికలో మార్కులు కొట్టేయటంలోని మతలబు అందరికీ తెలుస్తూనే ఉన్నది.
Back to Top