వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జిల్లాలలో అపూర్వ స్పందన లభిస్తోంది. పార్టీ జిల్లా కార్యాలయంలో నేతలు ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. అనేక చోట్ల వైయస్ఆర్ అభిమానులు, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషులు సంతకాలు చేయడానికి ముందుకొస్తున్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్న సీబీఐ చర్యల్ని తమ సంతకం ద్వారా ఖండిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకుని ఆయన్ని తక్షణం విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ సంతకాలు చేస్తున్నారు.శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా బీఆర్‌టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ సమీపంలో పార్టీ గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు పి. గౌతంరెడ్డి ఆధ్వర్యంలో రక్తంతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అధికార ప్రతినిధి యాదల శ్రీనివాసరావు, మహిళా కన్వీనర్ సునీత, సేవాదళ్ కన్వీనర్ కమ్మిలి రత్నకుమార్ తదితరులు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.మండల కేంద్రాల్లో... ప్రతి మండల కేంద్రంలోనూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సాగుతోంది. మహిళలు, వృద్ధులు కూడా వచ్చి సంతకాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదలకు ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరిస్తామని అనేక మంది మహిళలు పార్టీ నేతల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా చేపడతామని హామీ ఇస్తున్నారు.