పవర్ ఫుల్ కామెంట్ల కు పెట్టింది పేరైన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే రోజా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల బండారాన్ని బయట పెడుతున్నారు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల వైఖరిని జనం ముందు కుండబద్దలు కొడుతున్నారు. రోజా ప్రసంగంలోని పవర్ ఫుల్ పంచ్ కామెంట్ల్ ఇప్పుడు చూద్దాం
1. తెలంగాణలో 1400 రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టదా
2. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు చోటు లేదా.. మహిళలంటే అంత చిన్న చూపా
3. ఇద్దరు చంద్రుల పాలనలో అందరికీ కష్టాలే
4. ఓటుకి కోట్లు కుంభకోణంలో దొరికిపోయిన దొంగ చంద్రబాబు.. ఇక్కడకు వస్తే జైలు తప్పదని తెలుసు కాబట్టే ప్రచారానికి కూడా రావటం లేదు
5. కాంగ్రెస్ అభ్యర్థి వివరాలు కూడా ఇక్కడ వాళ్లకు తెలీదు
6. బీజేపీ అభ్యర్థిని దిగుమతి చేసుకొని పోటీ చేస్తోంది
7. బీజేపీ కి చంద్రబాబు వెన్నుపోటు పొడవటం ఖాయం. ఉపఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి బీజేపీకి వెన్నుపోటు తప్పదు
8. బీహార్ తరహాలోనే దిమ్మతిరిగేలా తీర్పు వస్తుంది
9. రాజన్న తనయుడు జగనన్న స్థాపించిన వైఎస్సార్సీపీతోనే ఆత్మహత్యలు లేని రాష్ట్రం వస్తుంది
10. రాజన్న రాష్ట్రం కోసం వరంగల్ ఉపఎన్నిక పునాది కావాలి