రిమైండర్ ఫర్ బాబు


2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. గ్రావిటీతో నీళ్లిస్తాం రాసిపెట్టుకోమన్నారు. మూడురోజుల్లో 2018 వెళ్లిపోతోంది. బాబుకు కాస్త గుర్తు చేయండి.
2018లో ఒలంపిక్స్ అమరావతిలో జరిపిస్తా అన్నాడు. 2018 పరుగెట్టుకు వెళ్లిపోతోంది. బాబుకు కాస్త ఒలంపిక్స్ గురించి గుర్తు చేయండి. 
2018 కల్లా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. 2019 వచ్చేస్తోంది వెలిగొండ సాగు తాగునీటి ప్రాజెక్టు సంగతేంటని బాబుకు గుర్తు చేయండి. 
2018 కల్లా రాజధాని తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. 2018 పూర్తి అయిపోయింది. మరి రాజధాని పనులు ఏదశలో ఉన్నాయో బాబుకు కాస్త గుర్తు చేయండి.
2018 కల్లా బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా ఏపీ అన్నాడు చంద్రబాబు. 18 పోతోంది. కానీ పరిశుభ్రత విషయంలో ఏపీ ఏ ర్యాంకులో ఉందో కనుక్కోండి. బాబుకు కాస్త గుర్తు చేయండి. 
2018లో 20లక్షల ఉద్యోగాలని చెప్పిన నారా నాన్నా కొడుకులు. 2018 పని అయ్యింది. 20లక్షల ఉద్యోగాలు ఎందరికొచ్చాయి. బాబుకు ఉద్యోగాల సంగతి గుర్తు చేయండి. 
2018 కల్లా రైతు రుణాలు పూర్తిగా మాఫీ అన్నాడు. ఇంకా మిగులు రుణమాఫీకీ మోదీ సాయం చేయడం లేదంటున్నాడు. 2018 రెండు వెళ్లిపోతోంది. రుణమాఫీ సంగతి బాబుకు గుర్తు చేయండి.
2018 కల్లా బందరు పోర్టు భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. 2018 అయిపోతోంది. బందరు పోర్టు కథ ఏమిటని బాబుకు గుర్తు చేయండి. 
2018 టార్గెట్ పెడుతూ చంద్రబాబు చెప్పినవేవీ పూర్తి కాలేదు. మళ్లీ ఎన్నికల స్టంటు లో 2022 కథలు బాబు సిద్ధం చేసుకుని వస్తున్నాడు. 2019కి పోలవరం, 2020కి 20లక్షల ఇళ్లు, 2022కు కోటి మందికి ఉద్యోగాలు, 2050కి ఏపీ ప్రపంచస్థాయి దేశంగా ఆవిర్భావం వంటి టైమ్ టార్గెట్లతో బాబు ఓట్లు అడగబోతున్నాడు. కనుక తెలుగు ప్రజలు ఆలోచించాలి. ఇంతవరకూ బాబు చెప్పిన 2018కి పూర్తికావల్సిన వాటి గురించి రిమైండ్ చేయాలి. ఇప్పటి వరకూ చెప్పిని చేయని బాబును మరిక నమ్మమని ఓటు గుద్ది మరీ చెప్పాలి. ఏపీ నుంచి బాబుకు టాటా చెప్పాలి. 
 
Back to Top