() చంద్రబాబు దురహంకారం మీద పంజా() పోరాడి గెలిచిన ధీర వనిత() రాజకీయాల్లో సంచలనంగా నిలిచిన రోజాహైదరాబాద్) అసెంబ్లీ వర్గాల్లో ఎమ్మెల్యే రోజా పేరు మార్మోగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే మంత్రి యనమల రామక్రిష్ణుడు పన్నిన దుష్ట పన్నాగాలకు ఎదురొడ్డి నిలవటంతో అంతా ఆమెను అభినందిస్తున్నారు. న్యాయం దక్కించుకొనేందుకు ఆమె చేసిన పోరాటాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో పోరాటంవైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆర్ కే రోజా..మొన్నటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. అసెంబ్లీ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకొన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయటంలో ముందంజలో ఉన్నారు. చైతన్యవంతులైన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వాన్ని కట్టడి చేస్తుండటంతో కన్నుకుట్టిన ప్రభుత్వం కుట్రలకు దిగింది. చిన్న వాదన్ని ఆధారంగా తీసుకొని అక్రమంగా రోజా మీద అస్త్రాన్ని ప్రయోగించింది.కుట్ర పూరితంగా కక్ష సాధింపుఅసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అకస్మాత్తుగా ఏడాది పాటు సస్పెండ్ చేయాలని మంత్రి యనమల కోరటం, ఆ వెంటనే సభాపతి కోడెల శివప్రసాద్ అంగీకరించటం చక చకా జరిగిపోయాయి. కనీసం ఏ కారణంతో సస్పెండ్ చేస్తున్నారు, ఏ నిబంధన కింద బయటకు పంపిస్తున్నారు అనేది కూడా చెప్పకుండా వ్యవహరించారు. ఆ విషయం తెలుసుకొనేందుకు మర్నాడు శాసనసభ కు వస్తే ఏమాత్రం అనుమతించకుండా, నడి రోడ్డు మీద అవమానించి అభినవ దుశ్శాసనులు అనిపించుకొన్నారు. ఆఖరికి కోర్టులు జోక్యం చేసుకొంటే తప్ప ఏ నిబంధన ప్రకారం సస్పెండ్ చేశారు అనే రికార్డులు ఇవ్వకుండా ఏడిపించారు. హౌస్ ఈజ్ సుప్రీం అంటూ అహంకార పూరితంగా మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వాదులు అందరికీ గుర్తున్నాయి.పట్టుదలతో పోరాటంఅసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే రోజాకు వైఎస్సార్సీపీ పూర్తిగా అండగా నిలిచింది. ప్రభుత్వాన్ని కారణం చెప్పాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గట్టిగా నిలదీయటమే కాకుండా స్పీకర్ కు బహిరంగ లేఖ రాశారు. దీని మీద స్పందన లేకపోవటంతో ఆయన సూచన మేరకు మహిళా ఎమ్మెల్యే రోజా న్యాయపోరాటానికి దిగారు. లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకొన్న ఇందిరా జైసింగ్ ( చూడండి: ఎవరీ లాయర్ ఫైర్ బ్రాండ్.. ఇందిరా ప్రొఫైల్ మీద స్పెషల్ స్టోరీ http://www.ysrcongress.com/news/special_stories/who-is-this-lady-advocate.html )) ను సంప్రదించి న్యాయపోరాటానికి దిగారు. మొదట హైకోర్టులో ఆమెకు న్యాయం దక్కకుండా ప్రభుత్వ వర్గాలు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. దీంతో ఆమె సుప్రీంకోర్టుకి వెళ్లి అక్కడ నుంచి అనుమతి తెచ్చుకొని హైకోర్టు తలుపు తట్టారు. నిబంధన 340 కింద సస్పెన్షన్ చేశామని అసెంబ్లీ అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఈ నిబంధన కింద ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. అయినా సరే, దీనికింద ఏడాది పాటు సస్పెండ్ చేశామని చెప్పటం ఎంత వరకు సబబు. ఇదే అంశాన్ని నిలదీసి ఆర్ కే రోజా న్యాయపోరాటం చేసి నెగ్గుకొని వచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి కి తీర్పు ప్రతి ఇచ్చి, తమ నాయకుడు వైఎస్ జగన్ ను కలిశారు. న్యాయ పోరాటంలో గెలిచిన రోజా కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.