పుట్టింటికి చేరిన చంద్రబాబు

జెడి లక్ష్మీనారాయణ ఎపీ టిడిపి ప్రచారకర్తగా, జేపీని వ్యూహకర్తగా, పార్టీ(కుల) సమన్వయకర్తగా, మిగిలిన వాళ్లను కమ్యూనికేషన్ కోసం వాడుకోవాలని టిడిపి కోర్ కమిటీ సిఫార్సు చేసిందని సమాచారం. మరోసారి ముఠా రాజకీయాలకు చంద్రబాబు సిద్ధపడుతున్న తరుణంలో అటు కేంద్రంలో మహా కూటమి, ఇటు రాష్ట్రంలో మాయా కూటమీ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. స్పెషల్ ఫ్లైట్ లలో స్పెషల్ పర్పసత్ తో చంద్రబాబు దిల్లీలో అడుగుపెట్టాడు. కాంగ్రెస్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ లను కలుస్తున్న చంద్రాబు జాతీయ రాజకీయాల్లో యాంటీ బీజేపీ ఎలిమెంట్స్ తో చేతులు కలుపుతున్నట్టు కనిపిస్తున్నా, అంతర్లీనంగా ఉన్న పర్సస్ వేరు. ప్రజాస్వామిక అవసరం, చారిత్రక అవసరం అంటూ చంద్రబాబు పొత్తుల గురించి ప్రతి సారీ చెబతుంటాడు. నిజానికి ఆ అవసరాలు చంద్రబాబువి. ఒకప్పుడు ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడం ఒక్కటే కారణం అయితే ఇప్పుడు తనపై ఉన్న అవినీతి ఆరోపణలు, పీకల్లోతు కూరుకుపోయిన తన ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవాల్సిన అవసరమే బాబును దిల్లీకి పరుగులు పెట్టిస్తోంది. మహాకూటమిలో చేరక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. బాము అవినీతి విశ్వరూపాన్ని ప్రజల ముందు ఉంచడానికి బిజెపి సిద్ధపడిపోయిన తర్వాత నుంచే బాబుకు బెంగ భయం పట్టుకున్నాయి. అంతకు ముందు వరకూ అంటే కేవలం కొద్ది నెలల ముందు కూడా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని ఎపిలోకి అడుగుపెడతారు అని అడిగాడు చంద్రబాబు. మరి ఇవాళ బాబు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ముంగిట్లో నిలబడ్డాడు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 
కేసుల నుంచి ఉపశమనం కోసమే
ఒకప్పుడు బిజెపి సర్కార్ తో కలిసి నడిచిన చంద్రబాబు ఆ పార్టీ అండతోనే నాలుగున్నరేళ్లుగా ఎల్లలు లేని అవినీతికి పాల్పడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కూడా వదిలేసారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను మాయం చేయడంలో, పోలవరం పేర దోపిడీ చేయడంలో, పట్టిసీమ, ఇతర ప్రాజెక్టుల పేరుతో సొంత వర్గ కాంట్రాక్టర్లకు మేళ్లు చేయడంలో, భూ దందాలు, ఇసుక దోపిడీలు, విదేశీ కంపెనీల లాలూచీలతోనే ఇన్నేళ్ల పాలనా భ్రష్టు పట్టిపోయింది. అయితే అడుగడుగునా బాబు అవినీతికి అడ్డు పడుతూ, దేశం మొత్తానికీ బాబు అవినీతిని దర్పణంలో చూపిస్తున్న ప్రతిపక్షం వల్ల చంద్రబాబుకు నిత్యం చేదు మాత్ర మింగినట్టే ఉంటోంది. ఇక ఓటుకునోటు లాంటి దేశాన్ని కుదిపేసిన కేసులో బాబుకు ఉచ్చు బిగుస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ హోదా ఉద్యమ సెగ అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రంలో నిమ్మకు నీరెత్తి ఉన్నచంద్రబాబుకు ఏకకాలంలో తగిలింది. అదే బిజెపి టిడిపి సంబంధం బెడిసి కొట్టడానికి కారణం అయ్యింది. ఇన్నాళ్లుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వైరం అనివార్యం అయ్యింది. ఎన్డీయే, టిడిపిల భాగోతాలు బైటపెట్టిన జగన్ మరో పక్క ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకాన్ని చూరగొన్నారు. ఇక రాష్ట్రంలో బిజెపి సాయం లేక, ప్రతిపక్షాన్ని ఎదుర్కునే మార్గం లేక బాబు కాంగ్రెస్ బాట పట్టాడు. 2019 కేంద్రంలో తిరిగి బిజెపి ప్రభుత్వం వచ్చినా, రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించినా బాబు భాగోతాలన్నిటినీ తవ్వి తీయడం ఖాయమని అర్థమైన తర్వాత చంద్రబాబు తన రూటు మార్చి రాహుల్ తో చేతులు కలిపాడు. కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో జగన్ ను అధికారానికి రానీకుండా చేయడమే తన రాజకీయ జీవితానికి శ్రీరామ రక్ష కనుక బాబు దిల్లీ ప్రయాణం కేవలం తన కేసుల ఉపశమనం కోసం జరిగే సర్దుబాటు ప్రయాణం. ఇన్నేళ్లలాగే కాంగ్రెస్ కూడా చంద్రబాబు కేసుల పై ఎలాంటి ఎంక్వైరీలు, ఎలాంటి విచారణలూ లేకుండా కాపుకాసేలా, బాబు తెలంగాణా, ఎపి, ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసి నడిచేలా చేసుకుంటున్న ఈ ఒప్పందం ఓ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ లాంటింది. నా కేసులు నువు ముట్టుకోవద్దు, నీ విజయానికి నా తోడు అన్న ఈ ట్యాగ్ లైన్ తో చంద్రబాబు ఇప్పుడు తన పుట్టింటికి చేరాడు. అంతేగా మరి...కాంగ్రెస్ నుంచి వచ్చిన చంద్రబాబు తిరిగి తిరిగి మళ్లీ కాంగ్రెస్లో విలీనం అవుతున్నాడు. 
 
Back to Top