పవన్ పాట్లు


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎపి రాజకీయాల్లో సంచలనాలకు మారు పేరుగా నిలిచారు. ప్రజలు ఆయన అజెండా. ప్రజాకంటక పాలనే ఆయనకు ప్రత్యర్థి. అంతకుమించి మిగిలిన విషయాలకు, అనవసరమైన ఆర్భాటాల జోలికీ జగన్ వెళ్లరు. ఇతర పార్టీలను అనవసరంగా విమర్శించడమో, అవసరం లేని విషయాలపై కల్పించుకుని కామెంట్లు చేయడమో ఆయన రాజకీయ జీవితంలో మచ్చుకైనా కనిపించదు. స్వరాష్ట్రంలో రాజకీయ పరిస్థితులుపై స్పందించేటప్పుడు కూడా అధికారపక్షం చేసే అన్యాయాలపై తప్ప అన్య పార్టీల విషయంలో జోక్యం కల్పించుకోరు. ఎందుకంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం ప్రజలను వంచిస్తుంటే ఎదిరించడం, నిలదీయడం ప్రతిపక్ష నేత బాధ్యత. 
అయితే జగన్ ఈ వైఖరి పవన్ కళ్యాన్ కు కంటగింపుగా ఉంది. టిడిపితో పొత్తు పెట్టుకుని, ఎన్నికలకు వెళ్లకుండా సాయం చేసి, ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి, కవాతులు, కథకళీలతో ఇంత చేస్తుంటే తన గురించి జగన్ మోహన్ రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం పవన్ ఇగోను చాలానే హర్ట్ చేస్తోంది. పట్టనట్టు, పట్టించుకోనట్టు ఉన్న జగన్ వ్యవహరాశైలిని మార్చాలనే పవన్ కళ్యాణ్ నానా తిప్పలూ పడుతున్నాడు. జగన పై కామెంట్లు చేయడం ద్వారా తనపై అటెంక్షన్ క్రియేట్ అయ్యేలా చేయాలన్నది పవన్ ప్లాన్ లా కనిపిస్తోంది. ఎన్ని కవాతులు చేసినా జనసేన టిడిపికి పిల్ల సేన అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. దీంతో ఆ మార్కును తుడిచేయడానికి, ప్రజల్లో తనపై ఉన్న ప్యాకేజీ ముద్రను తొలగించుకోడానికి ఓ డైవర్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. జగన్ తన గురించి మాట్లాడితే, విమర్శిస్తే దాన్ని అడ్డుపెట్టుకుని లబ్దిపొందాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ కు ఆ అవకాశం చిక్కడం లేదు. కార్లు మార్చినట్టు పెళ్లాలను మార్చే పవన్ కళ్యాణ్ అని, సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అంటూ రెండు సందర్భాల్లో తప్ప జగన్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గురించి చాలా తక్కువ సందర్భాల్లోనే మాట్లాడారు. పవన్ కు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ భావించడాన్ని తట్టుకోలేకే పవన్ కళ్యాణ్ రోజుకో రీతిలో జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ప్రభుత్వాలు చేసే తప్పులకు ప్రతిపక్ష నాయకుడిని తిట్టే రాజకీయవేత్త పవన్ తప్ప ఎవ్వరూ ఉండరు అంటున్నారు 
జగన్ పైనే ఎందుకు?
జగన్ జైలుకు వెళ్లడం తప్పదు అంటూ బహిరంగ సభలో పవన్ మాట్టాడిన తీరు చూస్తే అవగాహనా రాహిత్యం, అమ్ముడుపోయినతనం తెచ్చిన తెంపరితనం కనిపిస్తాయి. టిడిపి ప్రభుత్వంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి భాగోతాలు బయటపడుతున్నా వారిపై ఒక్క మాట మాట్లాడని పవన్, కోర్టులో కేసులు కొట్టేస్తున్న జగన్ ను జైలుకు వెళతాడనడం వెనుక ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బొత్స సంగతి తేలుస్తా అంటూ నోటికొచ్చినట్టు పేలుతున్న జగన్, టిడిపి అవినీతి అంతు తేలుస్తా అని ఎందుకు అనలేకపోతున్నాడు? ఈసారి పాకేజీ ఎంత ముట్టినట్టు? అంతర్గత పొత్తులు ఎంతదూరం వెళ్లినట్టు అని ప్రశ్నిస్తున్నారు తెలుగు ప్రజలు.

 
Back to Top