''అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. పదవుల కోసమే మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు. ఫిరాయింపు దారులను చిత్తుగా ఓడించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా'' ఇవి చంద్రబాబుగారి ఆణిముత్యాల్లాంటి డైలాగులు. కనీసం ఈ మాటలు అంటున్నప్పుడు కూడా చంద్రబాబులో ఏ కొద్ది కొశానా సిగ్గూ, లజ్జా కనిపించలేదామా అని రాజకీయా నాయకులే విస్తుపోతున్నారు. కానీ చంద్రబాబులో అలాంటివి పట్టించుకోరు. 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తన ప్రభుత్వంలో తన పక్కనే అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నాడు చంద్రబాబు. వారిలో కొందరికి మంత్రి పదవులూ ముట్టజెప్పాడు. ఇన్ని చేసినా బాబుకు ఫిరాయింపు దారులు అంటే తన పార్టీనించి వెళ్లినవాళ్లే గుర్తొస్తారు కానీ, తన పార్టీలోకి వచ్చినవాళ్లు మాత్రం గుర్తుకురారట. షార్ట్ టర్మ్ మెమొరీలాస్ లాంటి చిత్రమైన వ్యాధేదో బాబుకు వరంగా పరిణమించి ఉండాలి. కనుకనే ఆయనకు తనకు అనుకూలమైన, అవసరమైన విషయాలు తప్ప ఇతరాలను గుర్తు పెట్టుకోరు.ప్రజాస్వామ్యం పేరెత్తే అర్హత చంద్రబాబుకు ఉందా?రోజులో రెండొందల సార్లు ప్రజాస్వామ్యం అంటున్న చంద్రబాబుకు అసలా పేరు ఉచ్ఛరించే అర్హతైనా ఉందా అంటున్నారు రాజకీయ మేథావులు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన హంతకుడే చంద్రబాబు అని, దొంగే దొంగా అని అరిచిన విధంగా బాబు పోకడ ఉంటోంది అంటున్నారు. అమ్ముడు పోయిన వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతే ఆ వ్యాపారం జరిపిన వాళ్లు ఏమౌతారు? ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్లు ఏమౌతారు? ఎవరు తీసిన గోతిలో వారే పడతారనే సామెతలా బాబు ప్రతిపక్ష పార్టీకి నష్టం చేయాలని ప్రయత్నించి, సొంత పార్టీకి కన్నం వేసుకున్నాడు. బాబును నమ్మని తెలుగు రాష్ట్రాల ప్రజలుఫిరాయింపుదారులను చిత్తుగా ఓడించమని పక్కరాష్ట్రంలో చెబుతున్న చంద్రబాబు స్వరాష్ట్రంలో ఫిరాయింపుదార్లపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇన్నేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నికలు పెట్టమని ఎంతగా డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. వారిపై చర్యలు తీసుకోమని శాసన సభలో స్పీకర్ ను కోరినా ఎలాంటి ఫలితం లేదు. ప్రజాస్వామ్యాన్ని చట్ట సభల సాక్షిగా నవ్వుల పాలు చేసిన చంద్రబాబు నేడు ప్రజాస్వామ్యాన్ని కాపాడతాననడం హాస్యాస్పదం. ప్రజలు ఓ పార్టీ నుంచి ఎన్నుకున్న నాయకుడు ఆ ప్రజా అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీని మారడం అంటే ప్రజల ఓటును దుర్వినియోగం చేయడమే. వారి హక్కును కాలరాయడమే. ఎంతో పవిత్రమైన ప్రజాస్వామ్య విలువలను సమాధి చేసిన చంద్రబాబు తన అవకాశవాద సిద్ధాంతాన్ని, రాజకీయ అవసరాన్ని ప్రజాస్వామ్యం అని ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేవు. అది తెలంగాణా అయినా, ఏపీ అయినా బాబు అప్రజాస్వామిక చర్యలను ప్రజలు ఉపేక్షించరు.