నారా వారి ఆస్తుల వివరాలు...

నమ్ముతారా నా(రా)లెక్కలు..! 
అన్నీ అప్పులే మిగిలాయి. ఈమధ్యనే కొన్ని తీరాయి..!

అబద్దాలు ఆడడంలో అబ్బకు ఏమాత్రం తగ్గనని నిరూపిస్తున్నారు చినబాబు లోకేష్. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, మోసాలు చేయడంలో నా తర్వాతే మా బాబు అని ట్విట్టర్ లో చినబాబు పంపిన సందేశం రూఢీ చేస్తోంది. తన ఆస్తుల లిస్ట్ ను ప్రకటించిన చిన్నబ్బాయి ..తన మాదిరే అందరూ ఆస్తులు ప్రకటించాలని నాయకులకు సూచిస్తున్నాడు. అంతేకాదు  ప్రజధనాన్ని, రాష్ట్ర ఖజానాను అంతా లూటీ చేసి సింగపూర్ కు తరలించాం.  మాకు ఇక్కడ ఏం లేదు. కూరగాయలు, పాలు అమ్ముకుంటేనే ఇళ్లు గడుస్తోందని..మీరు అలాంటివే చెప్పండని నేతలకు హితభోద చేస్తున్నాడు కాబోలు. అంతేకాదు ఆరోపణలు వచ్చినందునే ఆస్తులు ప్రకటించానని, తమపై వచ్చిన ఆరోపణలను నిరూపించలేకపోయారని ట్విట్టర్ బాబు చెప్పుకొచ్చాడు. రాష్ట్రంలో తిష్టేసి ఆస్తులన్నీ సింగపూర్ తరలిస్తే ఎట్టా నిరూపిస్తారు బాబు..! హెరిటేజ్ లో నాణ్యత లేక నష్టాలు వచ్చాయని, ఇప్పుడు ప్రజలకు పాలు బాగా పోసి డబ్బులు సంపాదిస్తున్నామని చెవిలో పువ్వుపెడుతే ఎవరు నమ్మతారు చినబాబు 

ఇంతకీ చినబాబు ప్రకటించిన ఆస్తులు, అప్పులెంతో తెలుసా..?
 పేరు                         ఆస్తి                            అప్పు                       నికరం
చంద్రబాబు            రూ.50 లక్షలు              రూ.8 లక్షలు              రూ.42 లక్షలు
భువనేశ్వరి            రూ.43.20 కోట్లు           రూ.10.12 కోట్లు          రూ.33.08 కోట్లు
లోకేష్                   రూ.12.39 కోట్లు           రూ.4.72 కోట్లు            రూ.7.67 కోట్లు
బ్రాహ్మణి                రూ.5.14 కోట్లు               రూ.0.36 కోట్లు            రూ.4.78 కోట్లు
నిర్వాణ హోల్డింగ్స్    రూ.27.81 కోట్లు           రూ.26.44 కోట్లు          రూ.1.37 కోట్లు

అధికారంలోకి వచ్చాక తన అప్పులు బాగా తగ్గాయని, రూ.2 కోట్లతో ఫాం హౌస్ కూడా కట్టుకున్నాని అని చెప్పకనే చెబుతున్నాడు. తన శ్రీమతి బ్రాహ్మణి అప్పులు రూ.కోటి తగ్గాయని, ఈఏడాది రూ. 6 లక్షలు పెట్టి నగలు కొన్నామని లోకేశ్ విలేకరుల సమావేశంలో నమ్మశక్యంగాని నిజాలు పూసగుచ్చారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి బానే ఇల్లుకట్టుకున్నారు. నగలు కొనుక్కున్నారు. గుడిసెల్లో మగ్గుతున్న పేదలకు ఇళ్లెప్పుడు కట్టిస్తారు బాబు. రైతుల దగ్గర ఉన్న భూములు దోచుకున్నారు, రుణాలు చెల్లించడం లేదు. దీంతో అప్పులెక్కువై రాష్ట్రంలోని మహిళలు మెడలో ఉన్న నగలు అమ్ముకుంటున్నారు వాటి సంగతేంది బాబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నీదొంగ లెక్కల సంగతి మాకెందుకు గానీ..మీవల్ల అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గాథలు ఎవరు తీరుస్తారని నిలదీస్తున్నారు. 

Back to Top