నాలుగేళ్లుగా పోరాట పంథా



వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో స్వల్ప తేడా అతడిని అధికారినికి దూరం చేసి ఉండొచ్చు. కానీ ప్రజలకు మాత్రం దూరం చేయలేదు. పదవుల కన్నా ప్రజాహృదయ పీఠాలే మిన్న అని నమ్మినవాడు కనుకే అతడు నాలుగేళ్లుగా ప్రజల తరఫునే నిలబడ్డాడు. ప్రజలకు ఏ కస్టం కలిగినా నేనున్నా అంటూ నిలుచున్నాడు. ఆపద సమయాల్లో ఆప్తుడై, ఆత్మబంధువై నిలిచాడు. అందిరి కోసం ఒక్కడిగా నిలిచాడు. ప్రజా పోరాటాలను చేసాడు. 
తన తండ్రి మరణంతో మనోవ్యధకు లోనై ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలకు ఓదార్పు అతడయ్యాడు. అన్యాయంగా జైలు పాలు చేసినా అక్కడి నుండే సమైక్యదీక్ష చేపట్టాడు. ఏడు రోజులపాటు జైలు గోడలమధ్యే కాంగ్రెస్ నిరంకుశ రాష్ట్ర విభజన నిరసిస్తూ నిరాహారదీక్షకు పూనుకున్నాడు. అన్నదాతలకు గిట్టుబాటు ధర అందించమని ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతుదీక్ష చేపట్టాడు. తెలంగాణా ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి ప్రత్యేకించి రాయలసీమకు జరిగే నష్టం చెబుతూ కర్నూలులో జలదీక్ష చేసాడు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలుపుతూ ఆమరణ దీక్షకు దిగితే ప్రభుత్వం బలవంతంగా దీక్షను భగ్నం చేయించింది. ప్రత్యేక హోదా కోసం శాంతియుత నిరసనను, మౌనదీక్షకు  మద్దతును తెలిపేందుకు విశాఖకు వస్తే నిర్బంధించింది. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా అంటూ ఆ యువనేత తన పోరాట్నాి మాత్రం విడువలేదు.
ప్రజా మద్దతుతో హోదా పోరాటం ముందుకు నడిపాడు. యువభేరీలు నిర్వహించి యువతను చైతన్య వంతులను చేసి, హోదా ఉద్యమంలో భాగస్వాములను చేసాడు. హోదా ఉద్యమానికి భయపడి ప్రభుత్వం మాట మార్చితే వంచనపై గర్జన అంటూ ప్రభుత్వ తీరుపై నిప్పులు కురిపించాడు. కుల ఘర్షణలు జరిగిన చోటకు వెళ్లి శాంతియుత వాతావరణం ఏర్పరిచాడు. ప్రభుత్వ యంత్రాంగం అడుగుపెట్టని చోటకు వెళ్లి ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటాడు. ప్రకృతి విపత్తు వచ్చినా, ప్రభుత్వం భయపెట్టినా నేనున్నానంటూ భరోసా అందించాడు. ఆపద సమయాల్లో ఆపన్న హస్తం అందించాడు. అన్నివేళలా అందరివాడై నిలిచాడు. పేదవాడి కష్టమైనా, అన్నదాత ఆక్రోశమైనా, అక్కచెల్లెమ్మల కన్నీళ్లైనా వారి బాధను తన గొంతులో వినిపించాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నల వర్షం కురిపించాడు. 
ఆ పోరాటమే పాలకుల మెడలు వంచుతోంది. ప్రతిపక్షం ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఇదే ఓ నాయకుడి అంతిమ విజయం. ప్రజాబలం ఉన్న నాయకుడికి ప్రజలకు బలమై నిలిచిన నాయకుడికి ప్రభుత్వాన్నే కాదు ప్రపంచాన్నే జయించే శక్తి ఉంటుంది. అందుకు సాక్ష్యం వైఎస్ జగన్ రూపంలో మన ముందే ఉంది. 

 
Back to Top