నక్క ఎవరో మళ్లీ తేలిపోయింది..!’నాకు, జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’ ఆ మధ్యన అసెంబ్లీలోనే బాబుగారు నోట వచ్చిన ముత్యంలాంటి మాట ఇది. బాబు చెప్పే విధానంలోనే నక్క ఎవరో తేలిపోయింది, ఆయన కరెక్టుగానే చెప్పారంటే ప్రతిపక్షంకూడా బాహాటంగా చెప్పి సంతోషించింది. పోలిక చెప్పేటపుడు ముందు వెనకలు ఆలోచించుకోకుండా తానే నక్కనని బాబు ఒప్పుకున్నట్టయింది. అది విని బాధపడిన పచ్చ సైన్యానికి ఇప్పుడు నిప్పుగారు చేస్తున్న పనులు చూస్తే... వైయస్ జగన్ కి బాబుకి ఎంత తేడా ఉందో నిజంగానే అర్థమవుతోందట. అసలు విషయానికి వస్తే... విజయనగరం జిల్లాలో పాదయాత్ర బహిరంగ సభ జరుగుతోంది. వైయస్ జగన్ సభ అంటే ఆ పరిసరాలు జనసంద్రంగా మారిపోతాయనేది టిడిపితో సహా అందరికీ తెలిసిన వాస్తవమే. అలాంటి జనసంద్రంలో ఒక ఆటో పేషెంట్ ను తీసుకువెళ్లడానికి దారి లేకపోవడం గమనించిన జగన్... వెంటనే తన ప్రసంగం ఆపి ’ఆటో అంబులెన్స్ కి దారివ్వండి’ అంటూ ప్రజలకు పదే పదే విన్నవించారు. దాంతో ఆ ప్రజా వెల్లువ రెండుగా చీలిపోయే నాయకుడి చెప్పినట్టుగా దారిచ్చారు. పేషెంట్ ఉన్న ఆటో ముందుకు వెళ్లిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వైయస్ జగన్ మాట్లాడుతూ.. 108 ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా? ఆస్పత్రికి వెళ్లే దారిలో పేషెంట్ కి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఆ పథకం ఎంత దుస్థితికి చేరిందో చెప్పడానికి ఈ ఆటోనే ఉదాహరణ’ అంటూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి వైయస్ జగన్ చేసిన ఆ పని పార్టీలకతీతంగా అందరినీ ఆకర్షించింది, ఆలోచింపజేసింది. అదే బాబుగారికి నచ్చలేదు. ఎలాగైనా తాను జగన్ కంటే గొప్ప మానవతావాదినని చెప్పుకోడానికి స్కెచ్ వేశాడు. టిడిపి సభ జరుగుతున్న చుట్టుపక్కల అంబులెన్స్ తిరిగేలా చూడమని తమ్ముళ్లకు ఆర్డర్ వేశాడు. ఇంకేముంది.. పేషెంట్ తో పనిలేకుండా కుయ్ కుయ్ మంటూ ఒక అంబులెన్స్ అక్కడే తిరుగుతోంది. చివరకు ప్రజలు కూడా ఇది గమనించేసరికి ఒక పచ్చ కార్యకర్తను అందులో ఎక్కించి, గాయాలయ్యాయి అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇంతజరిగాక కూడా... బాబుకి వైయస్ జగన్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటే ఎవరు నమ్మరు చెప్పండి. చివరకు పులిని చూసి వాతపెట్టుకుంటున్న నిప్పులాంటి నక్కను చూసి తమ్ముళ్లు కూడా తల జెండాకేసి కొట్టుకుంటున్నారట.  

 

తాజా వీడియోలు

Back to Top