అడుగు అడుగులో రాజన్న జ్ఞాపకాలు

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇడుపులపాయలో మొదలైన తర్వాత ప్రతిచోట సంచలనంగా సాగింది. వేసిన అడుగులోనూ రాజన్న ముద్రలు, ఎన్నో మైలు రాళ్ళు.... వాటి అవలోకనమే ఇది...

70 రోజులు వెయ్యి కిలోమీటర్లు 70వ రోజున నల్లగొండ జిల్లా మిర్యాలగుడా నియోజకవర్గం దామరచర్ల మండలం కొండప్రోలు కాల్వ వద్దకు శ్రీమతి షర్మిల చేరుకునేసరికి వెయ్యి కిలోమీటర్లు యాత్ర పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో రక్తదానం చేశారు. వెయ్యిమందికి చీరలు పంపిణీ చేశారు. రక్తదానం చేసిన అనంతరం ఆమె 4.5 కి.మీ నడిచారు.  ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని ఫిబ్రవరి 21,22 తేదీలలో పాదయాత్రకు విరామం ప్రకటించారు.
 మంగళగిరిలో వందో రోజు పూర్తి
 మంగళగిరిలో శ్రీమతి షర్మిల పాదయాత్ర వందో రోజు పూర్తయ్యింది. ఈ సందర్భంగా హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ, రాజన్న ఆశయం.. జగనన్న దీక్ష ఒక్కటేనని తెలిపారు.
 వంద రోజులు నేను నడవగలిగానంటే దానికి మీ ప్రేమానురాగాలే కారణం. ఈ వంద రోజులు రాజన్న పాదమై నడిచాను. జగనన్న బాణమై పయనించాను. రాజన్న చనిపోలేదనీ, ప్రజల గుండెల్లో ఉన్నాడనీ, జగనన్నలో ఆయనను చూసుకుంటున్నారనీ అర్థమైంది. ఈ వందరోజుల్లో రాజన్న ఆశయాన్ని తలచుకుంటూ నడిచారు. వైయస్ పాలన ఓ స్వర్ణయుగంలా సాగింది. కన్నతండ్రిలా అన్ని వర్గాల శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని ఆయన పాలించారు. రైతులు రాజులుగా బతికిన రోజులవి. రైతులకు వైయస్ నీళ్లిచ్చాడు. ఏడు గంటలపాటు ఉచితంగా కరెంటిచ్చాడు. మద్దతు ధర ఇచ్చాడు. వారి అప్పులు తీరేందుకు 12వేల కోట్ల రుణమాఫీ కూడా చేశాడు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పావలా రుణాలిచ్చాడు. డబ్బులేని కారణంగా విద్యార్థుల చదువు ఆగకూడదని ఫీజు రీయింబర్సుమెంటు ఇచ్చాడు. పేదలకు పెద్ద ఆస్పత్రులలో లక్షలాది రూపాయల వైద్యం ఉచితంగా చేయించుకునేందుకు ఆరోగ్యశ్రీ అందించారు. రాజన్న ఆశయం, జగనన్న దీక్ష ఒక్కటే. మన రాష్ట్ర ప్రజలు, మన ైరె తులు, అక్కాచెల్లెళ్ళు, మన అవ్వా తాతలు, నూరేళ్ళు చల్లగా ఉండాలన్నదే వారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసమే జగనన్న తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు...అని ఆమె
 ఉద్వేగంగా ప్రసంగించారు.
 
 నాన్నే ఈ పాదయాత్రకు స్ఫూర్తి. జగనన్న నాయకత్వంలో మొదలైన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కడప, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు జిల్లాలు దాటి కృష్ణా జిల్లలో 1500 కి.మీ పూర్తిచేసుకుంది. ఈ పాదయాత్రకు వైయస్‌ఆర్ చేసిన ప్రజా ప్రస్థానమే స్ఫూర్తి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి భరోసా కల్పించడం కోసం, ధైర్యం సడలిన వారికి మంచిరోజులు ముందున్నాయని చెప్పడం కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా వైయస్‌ఆర్ ఆ మహాయజ్ఞాన్ని చేశారు. వైయస్‌ఆర్ ప్రజా ప్రస్థానానికి కొనసాగింపుగా మంచి రోజులు ముందున్నాయని చెప్పడం కోసమే ప్రస్తుతం మరో ప్రజా ప్రస్థానం చేస్తున్నాం. రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుందనీ, జగనన్న దాన్ని సాధిస్తారనీ ప్రజలకు ధైర్యం చెప్పడం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నాం.


తుని నియోజకవర్గం కాకరాపల్లిలో 2500 కి.మీ. పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సభలో ఆమె ప్రసంగించారు. సభకు ముందు ఆమె 24 అడుగుల ఎత్తయిన మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటికి 91 నియోజకవర్గాలలోని155 మండలాలు, 35 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 1551 గ్రామాలలో ఆమె యాత్ర చేశారు.

తాజా వీడియోలు

Back to Top