కంచరపాలెం జన సునామి దేనికి సంకేతం..?

ఏపీలో  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక ప్రబల శక్తిగా ఆవిర్భవించారా..? కంచరపాలెంలోని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగ సభకు పోటెత్తిన జన సునామీ రాష్ట్రానికి రథసారధిగా వైయస్‌ జగన్‌ అనివార్యమనే సంగతి తేటతెల్లం చేసిందా..? గత ఎన్నికల్లో కేవలం ఐదున్నర శాతం ఓట్లతో అధికారానికి దూరమయిన వైయస్‌ఆర్‌సీపీ ఓటు బ్యాంకు రికార్డు స్థాయిలో పెరిగిందా..? ఎన్ని కూటములు వచ్చినా వచ్చే ఎన్నికల్లో సంచలన మెజారీటితో  వైయస్‌ఆర్‌సీపీ అధికారం చేపట్టడం ఖాయమా? ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పెరుగెట్టిస్తున్నా ప్రశ్నలివి .. టీడీపీ ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు జననేత,రాజన్న బిడ్డ వైయస్‌ జగన్‌ వైపు చూస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రికార్డుస్థాయిలో ఓటు బ్యాంకును వైయస్‌ఆర్‌సీపీ సృష్టించుకుందని మేధావి వర్గాలు ఘంటాపథంగా చెపుతున్నాయి. ప్రజలతో వైయస్‌ జగన్‌ మమేకమవుతున్న తీరు, ప్రజాకష్టాలను తీర్చడానికి  నేను ఉన్నానంటూ భరోసాతో ప్రజలందరూ రాజన్నను జగన్‌లోనే చూసుకుంటూ మురిసిపోతున్నారు.రాజన్న వెలుగులు మళ్లీ ఆయన బిడ్డ జగన్‌ తీసుకువస్తారనే నమ్మకం ప్రతి గుండెల్లోనూ నాటుకుంటోంది. పచ్చనేతలు, పచ్చమీడియా జగన్‌ వ్యక్తిత్వంపై ఎన్ని దుష్ఫ్రచారాలు చేసిన మౌనంగా భరిస్తున్న  సహనశీలి. అక్రమంగా  కేసులు పెట్టి ఆర్థికంగా దెబ్బతీయాలనే టీడీపీ, కాంగ్రెస్‌ కుటిల యత్నాలకు ధైర్యంగా ఎదుర్కొన్న వైయస్‌ఆర్‌ వారసత్వం ఆయన..ప్రజల కోసం నిత్యం పడుతున్న కష్టమే వైయస్‌ జగన్‌ను ఒక శక్తిగా నిలబెడుతోంది.
 
Back to Top