<br/>చాలామంది సీనియర్ పొలీటిషియన్లు చంద్రబాబు గురించి తరచూ ఓ మాట అంటూ ఉంటారు. బాబు పెద్ద మాయలోడు. ఏదో ట్రిక్ ప్లే చేసి విషయాన్ని తారుమారు చేస్తాడు. అలాంటి ట్రిక్కులతోనే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అని. ఆ మాటలు వందశాతం నిజం అని మరోసారి రుజువయ్యాయి. ముఖ్యమంత్రి హోదాలో ధర్మపోరాట దీక్షకు కడపజిల్లా పొద్దుటూరుకు వేంచేసారు బాబుగారు. ఈ సందర్భంలో చంద్రబాబు నుంచి ఈ ప్రాంత వాసులు ఆశించింది వేరు. ఆరునెలల క్రితం కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అంటూ సిఎమ్ రమేష్ నిరాహారదీక్ష చేసాడు. ఆ దీక్షకు పూటకో కోటి ఖర్చు అయ్యింది. రోజుకో ప్రముఖ నాయకుడు వచ్చి పరామర్శలు చేసి ఉక్కు కర్మాగారం కడప హక్కు అని మైకులు మూర్ఛపోయేలా అరచి వెళ్లారు. చివరి రోజు వచ్చి కేంద్రం స్టీల్ ప్లాంట్ పెట్టకపోతే నేనే మొదలు పెడతాను అని పెద్ద ప్రతిజ్ఞ చేసి పోయారు బాబుగారు. పదిరోజుల నిరాహారదీక్షలో పావుకేజీ కూడా బరువు తగ్గని సిఎమ్ రమేష్ దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేసారు.ఇంత కథ నడిపారు గనక ఈ ధర్మపోరాటదీక్ష ప్రాంగణంలోనే చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారేమో అని ఎదురు చూసారు కడప వాసులు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆశించారు. కేంద్రం నుంచి స్పందన లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని మాటిచ్చింది కనుక ఈ సందర్భంలో చంద్రబాబు ఆ హామీపై ప్రజలకు ఓ భరోసా కలిగిస్తారని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ చంద్రబాబు మరోసారి ప్రజలకు మొండి చేయి చూపించాడు. కేంద్రానికి మరో నెల గడువిస్తున్నాను..వారు స్పందించకుంటే నెల తర్వాత నేనే శంకుస్థాపన చేస్తానంటూ మరోసారి జెల్ల కొట్టి పోయాడు. ఇవిగో అవిగో పరిశ్రమలు, రాష్ట్రంలో పెట్టుబడులకు క్యూ కడుతున్న ఇన్వెస్టర్లు అని పదే పదే చెప్పే చంద్రబాబు కడప స్టీలు ప్లాంట్ కోసం ఒక్క పారిశ్రామికవేత్తనీ ముందుకు తేలేక పోయాడన్నది వాస్తవం. బాబు దొంగ అబద్ధాల దీక్ష ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కె.శ్రీనివాసులు చంద్రబాబు కడప స్టీలు ప్లాంట్ ను రాజకీయ లబ్దికి ఉపయోగించుకోడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, నాలుగున్నరేళ్లుగా అధికారం అనుభవిస్తున్నప్పుడుగానీ గుర్తుకు రాని కడప స్లీటు ప్లాంట్ నిర్మాణం ఇప్పుడు నీకు అవసరం ఎందుకైందని వారు బాబును సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా కడప రౌడీలు, రాయలసీమ రౌడీలు అంటూ సీమ ప్రజలను అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబుకు రాయలసీమ లో అడుగుపెట్టే హక్కు లేదని అన్నారు. ఎలాగూ 2019 ఎన్నికలు గెలవడు కనుక ఓ పునాదిరాయి వేసి తర్వాత జగన్ పూర్తి చేసే కడప స్టీలు ప్లాంటును నేనే ఏర్పాటు చేసానని చెప్పుకోవడానికి బాబు ఎదురు చూస్తున్నాడన్నారు. చంద్రబాబు ఇలా వేరొకరి క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడం అలవాటే అని ఎద్దేవా చేసారు. గండికోట ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేసానని చెప్పడం హాస్యప్పదంగా ఉందని, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హత్యాయత్నం, దాడి జరిగిన ప్రతిపక్ష నేతపై ఎదురుదాడి చేయడం ఎలాంటి సంస్కారం అని ప్రశ్నించారు. బాబు నలభై ఏళ్ల అనుభవం ఎందుకు పనికొస్తుందో ఆయన విజ్ఞతకే వదిలేస్తామని చెప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. కడప స్టీలు ప్లాంటు పేరుతో ఓట్ల రాజకీయాలు చేద్దామనుకునే చంద్రబాబు ట్రిక్స్ ను కడప వాసులే కాదు, రాయలసీమ వాసులెవ్వరూ నమ్మరని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. <br/>