హైదరాబాద్) గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరిపించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుస్తోంది. శాసనసభలో మంత్రి పీతల సుజాత చేసిన ప్రకటన వింటే ఈ సంగతి అర్థం అవుతుంది. బాక్సైట్ తవ్వకాల్ని గిరిజనులంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక రకంగా బాక్సైట్ తవ్వకాలు జరిపించేందుకే నిశ్చయంతో ఉంది. దీనిమీద ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందని ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు తుస్సు మనిపించింది. ప్రభుత్వం తరపున మంత్రి పీతల సుజాత ఒక ప్రకటన చేశారు. కానీ ఇందులో పూర్తిగా బాక్సైట్ తవ్వకాలకు ఊతం ఇచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలోనే అని చెప్పేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు తప్పితే పూర్తి స్థాయి వివరాలు చెప్పనేలేదు. పైగా ప్రజల మనోభావాల గురించి వివరణ లేనే లేదు. స్పష్టంగా జీవో నెంబర్ 97ను (బాక్సైట్ తవ్వకాల్ని అనుమతిస్తూ జారీచేసిన జీవో) రద్దు చేస్తామని ఎక్కడ ప్రకటనలో చెప్పలేదు. పైగా ఇంతటి ముఖ్యమైన అంశం మీద పోరాడుతున వైఎస్సార్సీపీ శాసనసభ లో లేని సమయం చూసి ప్రకటన చేసి ప్రభుత్వం బయట పడిపోయింది. మొత్తం మీద చంద్రబాబుచేస్తున్నది అంతా శెభాష్ అని తమకు తామే కితాబు ఇచ్చుకొని బయట పడిపోయారు.