నైతిక విలువలు బాబుకు పట్టవా

– శాఖా పరమైన లోపాలు ఇప్పుడు తెలిశాయా
– బోటు ప్రమాదం జరిగిన వారం తర్వాత బాబు స్పందన
– గోదావరి పుష్కర ప్రమాదానికి బాబు బాధ్యత వహించరా
– దుర్ఘటనలపై వేసిన కమిషన్ల నివేదికలు ఏవి?

‘తమ శాఖలో అవకతవకలు జరిగినప్పుడు, అవినీతి ఆరోపణలు  వెల్లువెత్తినప్పడు గతంలో నైతిక విలువలకు కట్టుబడి బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. బోటు ప్రమాదంలో 22 మంది చనిపోతే కనీసం స్పందించాల్సిన రీతిలో కూడా స్పందించలేదు’ ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతల సమావేశంలో మంత్రి అఖిల ప్రియను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు. విజయవాడ ఫె్రరీ ఘాట్‌లో బోటు ప్రమాదం జరిగి 22 మంది చనిపోయిన విషయం చంద్రబాబుకు ఇప్పుడే తెలిసినట్టుగా చాలా వేగంగా స్పందించారు. పైగా ఈ ప్రమాదాన్ని భూమా అఖిల ప్రియ మీదకు నెట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు తిరిగి తిరిగి చంద్రబాబునే కార్నర్‌ చేసేలా ఉన్నాయి. ఒక్కసారి గతంలోకి చూస్తే చంద్రబాబు ఇంతకన్నా దారుణంగా వ్యహరించారు. 

కమిషన్ల నివేదికలు ఏమైనట్టు
గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు వ్యవహరించిన తీరుతో 29 మంది అమాయక ప్రజలు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. పదహారేళ్లకొచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరిద్దామని వచ్చిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బ్రహ్మ ముహూర్తాలంటూ ప్రచారం చేసి జనాలంతా ఒకే సమయానికి తండోపతండాలుగా వచ్చేలా చేసుకున్నారు. పుష్కర ఏర్పాట్లంటూ వందల కోట్లు ఖర్చు చేశారు. కానీ జరిగింది వేరు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసం దర్శకుడు బోయపాటి శ్రీనుని పిలిపించి చేసిన షూటింగ్‌ కారణంగా తొక్కిసలాటలో జరిగి 29 మంది చనిపోయారు. వీఐపీలకు ప్రత్యేక ఘాట్‌లు ఏర్పాటు చేసినా చంద్రబాబు మాత్రం సామాన్యుల కోసం కేటాయించిన ఘాట్‌లలోనే కుటుంబ సమేతంగా స్నానాలకు వచ్చారు. దీంతో లక్షల్లో వచ్చిన జనాన్ని అక్కడే నిలిపేశారు. చంద్రబాబు కుటుంబం వెళ్లిన తర్వాతే సామాన్యులను స్నానాలకు అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. దీనిపై చంద్రబాబు ఒక కమిషన్‌ ఏర్పాటు చేశాడు. అదేమైందో ఎవరికీ తెలియదు. 
అమాయక కూలీలపై కాల్పులు 
ఎ్రరచందనం దొంగలంటూ తిరుపతిలోని శేషాచలం అడవుల్లో 20  మంది అమాయక తమిళ కూలీల మీద కాల్పులు జరిపారు. దీనిపై చంద్రబాబు వ్యవహారంపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులను పక్కనపెట్టి అమాయక కూలీలను బలిచేశారన్న విమర్శలు లేకపోలేదు. 
ఏర్పేడు బాధితులకు న్యాయం చేశారా
చిత్తూరు జిల్లాలో ఏర్పేడు వద్ద జరిగిన లారీ ప్రమాదంలో 11 మంది కూలీలు బలయ్యారు. రోడ్డు పక్కన నిల్చున్న అడ్డా కూలీల మీదకు ఇసుక లారీ దూసుకురావడంతో వారంతా దుర్మరణం చెందారు. ప్రమాదానికి కారణమైన లారీ టీడీపీ నాయకులదని తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్టు అధికారికంగా ప్రకటించినా ఆ తర్వాత కాలంలో వారంతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. 
నిందితులను వదిలి అమాయకులపై చర్యలు
నైతిక విలువల గురించి చెప్పే చంద్రబాబు... ఆయన ఏ మేరకు నడుచుకుంటున్నారో చూస్తే ఆయన వ్యవహారం భిన్నంగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అమాయకులను బలిచేసి అసలు నిందితులను వదిలేసే నైజం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. దానికి వంత పాడటానికి మీడియా ఎలాగూ ఉంది. ప్రమాదం జరిగినప్పుడు కమిషన్లు వేసి కమీషన్లు తీసుకోవడం తప్ప ఏ ఒక్క సంఘటనలోనూ నిందితులకు శిక్షలు పడిన దాఖలాలే లేవు. 
‘రెడ్డే’ టార్గెట్‌...
మొదట్నుంచీ చంద్రబాబు ఒక వర్గాన్నే ప్రోత్సహిస్తారనే పేరుంది. దానికి తగ్గట్టుగా పార్టీ ఆంతరంగిక విషయాలను కూడా వారితోనే చర్చిస్తుంటారని అందరూ చెబుతుంటారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళీమోహన్‌ వంటి వారితోపాటే కొందరు అదే సామాజిక వర్గానికి చెందిన మీడియా పెద్దలతోనూ చంద్రబాబు ఆంతరంగిక చర్చలు నడుపుతుంటారని ఓపెన్‌ సీక్రెట్‌. వారిపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలుండవని పలు ఘటనలు రుజువు చేశాయి కూడా. అదే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులపై మాత్రం చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకపోవడం కూడా జరుగుతూనే ఉంది. అవినీతి ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని, కబ్జా కేసులున్నాయని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని ఆలోచించకుండా పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో తీవ్రమైన అవినీతి చేశాడని సీఎం రమేష్‌పై టీడీపీ అనుకూల మీడియాలోనే చాన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. సుజనా చౌదరి విషయం చెప్పనక్కర్లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేతదారుడని అందరికీ తెలిసిన నిజమే. పేపర్ల నిండా వార్తలొచ్చాయి. అయినా కేంద్రంలో మంత్రిగా కొనసాగిస్తూనే ఉన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద అమరావతి భూముల కుంభకోణంతోపాటు నకిలీ విత్తనాల కేసులో ఆరోపణలొచ్చినా పట్టించుకోలేదు. దేశవ్యాప్తంగా అత్యాచారం కేసులు నమోదైన మంత్రులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని ఉమామహేశ్వర్‌రావు, అచ్చెన్నాయుడులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 
తాజాగా ఇప్పుడు భూమా అఖిల ప్రియ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి అనుమానాస్పదంగా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులపై ఆగమేగాల మీద చర్యలు తీసుకోవడానికి ఆలోచించని చంద్రబాబు.. తన సొంత సామాజికవర్గంకు చెందిన నాయకులపై మాత్రం ఎన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం నంద్యాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఆనాడు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. నంద్యాల్లో గెలిచాక సందర్బం చూసి ఆమెను పక్కనపెట్టడానికి అవకాశం కోసం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన బోటు ప్రమాద ఘటనను ఇందుకు అవకాశంగా చూపించి అఖిల ప్రియను భర్తరఫ్‌ చేయాలని కుట్రపన్నుతారని కూడా అఖిల ప్రియ ఆంతరంగికుల నుంచి అందుతున్న ఫిర్యాదుల సారాంశం. రాబోయే ఎన్నికల లోపు అఖిల ప్రియను పార్టీ నుంచి సాగనంపితే రాబోయే 
Back to Top