ప్రతిపక్ష నేత పర్యటనకు భయపడే..వైఎస్సార్సీపీ ఆందోళనలతో దిగివచ్చిన సర్కార్...
విశాఖపట్నంః గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ పోరు తీవ్రతరం చేయడంతో ...ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గింది. జీవోను ఉపసంహరించుకుంటున్నట్లు కేబినెట్ తీర్మానించింది. ఆదివాసీలకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిసెంబర్ 2న చింతపల్లిలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలోనే భయపడిపోయిన టీడీపీ సర్కార్ బాక్సైట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అక్రమ ధనార్జన కోసం 3 వేల ఎకరాల్లో బాక్సైట్ ను తవ్వాలని టీడీపీ సర్కార్ ప్లాన్ వేసింది. దీనిలో భాగంగానే గిరిజనుల హక్కులు కాలరాస్తూ అర్థరాత్రి హడావుడిగా ...బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో 97 తీసుకొచ్చింది. దీంతో, మన్యం భగ్గుమంది. గిరిజనుల పక్షాన వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు...ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు చేపట్టారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సారథ్యంలో నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు నిలిపేయాలని గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక అదే గిరిజనుల సంపదపై కన్నేశారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు విల్లులు పట్టుకొని ఉద్యమిస్తానని చెప్పాడు. సీఎం పీఠం దక్కేసరికి ప్లేటు ఫిరాయించారు. చంద్రబాబు కుటిల బుద్దిని వైఎస్సార్సీపీ మీడియా ముందు బయటపెట్టింది. దీంతో, కంగారుపడిన చంద్రబాబు హడావుడిగా ఆనాడు గవర్నర్ కు రాసిన లేఖను టీడీపీ వెబ్ సైట్ నుంచి తొలగించేశారు.
వైఎస్ జగన్ చింతపల్లి పర్యటనకు భయపడే చంద్రబాబు జీవోను తాత్కాలికంగా నిలిపివేశారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. జీవోను శాశ్వతంగా రద్దు చేసేవరకు వైఎస్సార్సీపీ ఉద్యమం కొనసాగిస్తుందని, గిరిజనులకు అండగా నిలుస్తుందని ఈశ్వరి స్పష్టం చేశారు.