రైతుల భూములు తాకట్టు

*రాజధాని పేరుతో దోపిడీకి సర్కార్‌ మరో ఎత్తుగడ
*గతంలో కేంద్రం ఇచ్చిన నిధులు మింగేసిన అధికార పార్టీ నేతలు
*భవిష్యత్తులో సాయం చేసేందుకు నిరాకరిస్తున్న మిత్రపక్షం
*కేంద్రం ఇచ్చిన షాక్‌తో దిక్కుతోచని స్థితిలో బాబు
*అమరావతి భూములు విదేశీయులకు కట్టబెట్టేందుకు కుట్ర
*నిజమవుతున్న వైయస్‌ఆర్‌ సీపీ అనుమానాలు

సొమ్ము ఒకరిది..సోకు ఇంకొకడిది అన్నట్లుగా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు తీరు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకొని, వాటితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు పచ్చ నేతలు సిద్ధపడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తూ అధికార పార్టీ నేతలు దర్జాగా దండుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు  రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీకి పచ్చ పార్టీ స్కెచ్‌ వేసింది. రైతుల నుంచి తీసుకున్న భూములను తాకట్టు పెట్టి దోచుకునే కుట్ర చేస్తోంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పుకుంటూ అధికార పార్టీ నేతలు దోపిడీకి తెర తీశారు. ఆ పేరుతో వచ్చిన నిధులను సొంత ఖర్చులకు వినియోగిస్తూ డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు నిజ స్వరూపం రోజు రోజుకు బయట పడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసమంటూ రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూముల్లో ప్లాట్ల వ్యాపారం చేయబోతున్నారంటూ వైయస్‌ఆర్‌సీపీ వినిపించిన వాదనలే నిజమయ్యాయి. 

రాజధాని కోసం వేల ఎకరాలు బలవంతంగా ఎందుకు సేకరిస్తున్నారో చెప్పాలంటూ వైయస్‌ఆర్‌సీపీ కూడా డిమాండ్‌ చేస్తోంది. పంటలు పండే వ్యవసాయ భూములను రైతులను బెదిరించి లాక్కోవడం కుదరదంటూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, టీడీపీ నాయకులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడతున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు అసెంబ్లీలో అధికార పక్షం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సచివాలయం, ఇతర కార్యాలయాలు నిర్మించడానికి ఇంత భారీగా భూములు లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ధ్వజమెత్తారు. భూములు కోల్పోయి రోడ్డున పడుతున్న రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కనీసం రైతులకు నష్టపరిహారం కూడా చెల్లిచకుండా సింగపూర్‌ కంపెనీలకు కట్టబెట్టడంపై బాధిత రైతులత కలిసి వైయస్‌ జగన్‌ ఉద్యమించారు కూడా. 

బాబు విజన్‌ ఇదేనా?
చంద్రబాబు విజన్‌ ఏంటో వెల్లడైంది. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వదని తేలిపోయింది. విదేశీ సంస్థలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో చంద్రబాబు అమరావతిని తాకట్టుపెట్టడానికి సిద్ధమయ్యారు. రైతుల నుంచి సేకరించిన భూముల్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. నిధుల కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చంద్రబాబు రైతుల పొలాల్ని బలవంతంగా లాక్కోవడానికి పథక రచన చేశారు. అయితే దీన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రైతుల నుంచి తీసుకున్న భూములకు ఇంకా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. భూములు తీసుకున్న ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చనే లేదు. కానీ రైతుల భూముల్ని తాకట్టుపెట్టి ప్రభుత్వం పబ్బం గడుపుకోవాలని మాత్రం చూస్తోంది. దీనివెనుక ఎంత పెద్ద కుట్రదాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతా పథకం ప్రకారమే..
అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక హంగులతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు డాబులు పలికాడు. కానీ విదేశీ కంపెనీలు అమరావతికి రావడానికి  వెనకాడుతున్నాయి. దీంతో, బాబు సేకరించిన భూముల్ని తాకట్టు పెట్టేందుకు తయారయ్యారు. రెండేళ్లు గడిచాయి. అయినా రాజధాని నిర్మాణం అడుగు ముందుకు పడలేదు. చంద్రబాబు ప్రకటనలు అంటే ఇలాగే ఉంటాయని అందరూ భావిస్తున్నారు. రుణమాఫీ లాగే రాజధాని నిర్మాణం కూడా ఉంటుందని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని భయపడుతున్నారు. అందుకే రాజధాని కోసం భూముల్ని తాకట్టుపెడుతున్నారు. దీనికి 32 వేల కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. దీనిపై చాలా రోజుల నుంచి వివిధ మార్గాలను అన్వేషించిన సర్కారు భూముల తాకట్టు ద్వారా నిధుల్ని పోగుచేసేందుకు సిద్దపడింది. భూములు తీసుకొని రుణాలు ఇచ్చే సంస్థలను కూడా ఎంపిక చేసుకున్నారు. ఇవి కూడా అంతర్జాతీయ సంస్థలను ఎంపిక చేసుకున్నారు. మొత్తం మీద 9 రకాల రుణాలను భూములు ఇచ్చి లబ్ధిపొందాలని ప్రభుత్వం యోచనగా ఉంది. 

Back to Top