విద్యార్థులు, నిరుద్యోగులకు కుచ్చు టోపీ


రాజధాని ప్రాంతంలో
విద్యార్థులు, నిరుద్యోగులు లబోదిబో మంటున్నారు. చంద్రబాబు మార్కు కుట్ర అర్థం అయ్యేసరికి,
విద్యార్థులు, నిరుద్యోగుల తల్లిదండ్రులు 
ఆందోళన చెందుతున్నారు.

రాజధాని ప్రాంతంలో భూములు
లాక్కొనేందుకు చంద్రబాబు, ఆయన మంత్రులు చాలా నాటకాలు సాగించారు. అందులో భాగంగా
రాజధాని ఏర్పడితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఏర్పడతాయని, అవన్నీ ఇక్కడి వాళ్లకే అని
నమ్మబలికారు. రాజధాని కోసం భూములు ఇస్తే, ఆయా రైతుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలు
అంటూ గాలిలో మేడలు కట్టారు. అంతే కాదు. ఇందుకోసం ఊరూరా సర్వే చేస్తున్నామంటూ
లెక్కలు రాసుకొన్నారు. ఇది నిజమని నమ్మిన రైతులు తమ భూముల్ని తెచ్చి అప్పనంగా
అప్పగించేశారు. అంతే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి చోట్ల ఉద్యోగాలు
చేసుకొంటున్న తమ పిల్లల్ని రప్పించి ప్రభుత్వ పెద్దల ముందుహాజురు పరిచారు.

ఈలోగా మాస్టర్ ప్లాన్
విడుదల అయింది. 2050 నాటికి పది లక్షలమంది కి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఘనంగా రాతలు
రాసేసరికి ఇక్కడి వారంతా మురిసిపోయారు. అవన్నీ తమ సొంతం అనుకొన్నారు. మొదటి దశ
అంటూ 126 మందిని ఎంచుకొన్నారు. వీరంతా ఇంజనీరింగ్; ఎంబీయే, ఎంసీయే వంటి కోర్సులు
చదివిన వారే. గుంటూరు లోని లామ్ ఫామ్ పరిశోధన కేంద్రంలో ఇంటర్వ్యు లు నిర్వహించి
ఎంపిక చేశారు. తమ పిల్లలంతా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయినట్లే అని తల్లిదండ్రులు
సంతోషించారు. మొదటి దశగా నాగార్జున యూనివర్శిటీ లో, రెండో దశగా శ్రీకాకుళం జిల్లా
లో శిక్షణ ఇచ్చారు. కోర్సు పూర్తవుతోంది కానీ, పోస్టింగుల మాట లేనే లేదు. దీంతో
అనుమానం వచ్చి విద్యార్థులు నిలదీస్తే అసలు బండారం బయట పడింది. ఇవసలు ఉద్యోగాలు
కానే కావు, కేవలం ఉద్యోగాలు పొందేందుకుఅవసరం అయ్యే శిక్షణ అంటూ అధికారులు చావు
కబురు చల్లగా చెప్పారు. దీంతో కడుపు మండిన విద్యార్థులు వెనక్కి తిరిగి వచ్చి
క్రీడా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

మొత్తం మీద పొలాలు లాక్కొనేందుకు
రక రకాల అబద్దాలు పలికిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఇప్పుడు ఆ చుట్టుపక్కల లేరు.
మంత్రులు అటుకేసి వెళ్లడం లేదు. దీంతో రైతుల గోడు అరణ్య వేదన అయింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top