రాష్ట్రాన్ని గాలికొదిలేసి విదేశాల్లో జల్సాలు

– బాబుది.. సమ్మర్‌ టూర్‌
– పెట్టుబడుల కోసం కాదు.. చల్లదనం కోసం
– అమెరికా పర్యటన వెనుక కారణం ఇదే
– డెల్, ఆపిల్‌ రావడమంతా పచ్చ సృష్టే
– నిజమైతే వివరాలు వెల్లడించేవారే కదా..!

అదే కథ.. అవే మాటలు.. అదే రాతలు. ఏం తేడా లేదు. అచ్చుగుద్దినట్టు అలాగే. మళ్లీ మళ్లీ మోసం. పచ్చ పత్రికలు, ఛానళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్న డ్రామా. పడికట్టు పదాలతో పచ్చ పత్రికలు బాబు వేసే వెంగిలి మెతుకులకు ఆశపడి చేస్తున్న  నయవంచన. డబ్బు కోసం ఏపీ ప్రజలను నిలువునా మోసం చేయడానికి కూడా బాబు భజన బ్యాచ్ వెనుకాడడం లేదు.  

పతాక శీర్షికల్లో అబద్ధాలు
అబద్ధాలను పతాక శీర్షికల్లో ప్రచురించి నిరుద్యోగ యువత భవితవ్యంతో పచ్చ పత్రికలు డ్రామాలు ఆడుతున్నాయి. చంద్రబాబు ప్రాప్తం కోసం.. ఆయన విసిరే వెంగిలి మెతుకులకు ఆశపడి పచ్చ మీడియా మొత్తం అనుకుల బంధంగా ఏర్పడి అబద్ధాన్ని నిజం చేయడానికి తాపత్రయ పడుతున్నాయి. నిన్నటికి నిన్న ఆపిల్‌ కంపెనీ వచ్చిందని మొదటి పేజీ బ్యానర్‌ వార్తలో ప్రచురించిన పచ్చ పత్రికలు.. నేడు డెల్‌ కంపెనీ వచ్చేసిందని గప్పాలు కొడుతున్నాయి. నిజానికి ఆయా కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు ఎక్కడా రాయలేదు. ఎప్పుడు కంపెనీలు పెడుతున్నారు.. వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వబోతున్నారు అనే అంశాలను ప్రస్తావించలేదు. ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా ఎక్కడా మేము కంపెనీ పెట్టబోతున్నామని ప్రకటించనూ లేదు. మరి అలాంటప్పుడు పచ్చ పత్రికలు కంపెనీలు వస్తున్నాయని ఎలా చెప్పగలరు. ఇదంతా బాబును హీరోను చేసి జనాన్ని పిచ్చోళ్లను చేయడానికి చేస్తున్న ప్రచారమే తప్ప నిరుద్యోగ యువతకు ఒక్క పైసా ఉపయోగం లేదు. మన ఇంటికి బంధువులు వస్తారు.. తిరిగెళ్లేటప్పడూ మనల్ని కూడా వారింటికి ఆహ్వానిస్తారు. మనం కూడా సానుకూలంగా వస్తామనే చెబుతాం. ఇక్కడ చంద్రబాబు అమెరికా పర్యటనలో కూడా జరిగిందంతే. దానికే పచ్చ పత్రికలు ఆపిల్, డెల్‌ కంపెనీలు ఏపీకి వచ్చాయని రాసేయడం జనాన్ని మోసం చేయడమే. ఏపీలో మూడేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. 

పర్యటనలతో సాధించిందేంటి
చంద్రబాబు ఇప్పటి వరకు 16 విదేశీ పర్యటనలు చేశాడు. భాగస్వామ్య సదస్సులు జరిగాయి. ఏడు కోట్లు పెట్టి దావోస్‌ టిక్కెట్‌ కొని వెళ్లిన బాబు సదస్సుతో సాధించింది  ఏమీ లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఇప్పటికే ఆరు లక్షలు ఇచ్చారంటా.. రాబోయే రెండేళ్లలో  మరో పది లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. ఇదెక్కడి చోద్యం. ఏ ఊరిలో చూసినా ఒక్కరికి కూడా ఉద్యోగం దక్కిన దాఖలాలు లేవు. మూడేళ్లుగా నోటిఫికేషన్లు లేక, నిరుద్యోగ భృతి అందక పట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. బాబు విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ సాంబారు, పప్పు, ఫ్రై, చికెన్, చేప అని పచ్చ మీడియా రాసుకోవడం తప్పించి ఉద్యోగాల ఊసెత్తిన పాపాన పోవడం లేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో.. ఎవరెవరు ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నారో.. ఆ పొందిన వారి వివరాలు కూడా ఇవ్వలేదు. 

సమ్మర్‌ టూర్‌.. సమ్మిట్‌ టూర్‌ కాదు
రాష్ట్ర ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే చంద్రబాబు మాత్రం పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలకు వెళ్లడం దారుణం. పోనీ ఏమైనా పెట్టుబడులు తెచ్చాడా అంటీ అది లేదు. ఒకవైపు రైతులు మద్దతు ధర లేక అల్లాడిపోతున్నారు.. కడుపు మండి పండించిన పంటను రోడ్డుపైనే తగలేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు కనీసం తాగడానికి కూడా నీరు లేక  నరకయాతన అనుభవిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడటం లేదు. సోమ, గురు వారాల్లో గ్రీవెన్స్‌కి హాజరు కావాల్సిన మంత్రులు ప్రజల ముఖం చూడటమే మానేశారు. బాబు అమెరికాలో విడిది చేస్తుంటే ..తమ్ముళ్లు  లోకల్ లో  ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంత దారుణంగా ఏపీలో పాలన సాగుతోంది. 
Back to Top