రైతుల‌కు చంద్ర‌న్న కానుక‌లు

హైద‌రాబాద్‌) ఏరువాక సాగి ముఖ్య‌మంత్రి హుషారుగా ఖ‌రీఫ్ వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభించారు. రాష్ట్రమంతా సాగు ప‌నుల్లో సుభిక్షంగా ఉంద‌ని ప‌చ్చ మీడియాలో వార్త‌లు రాయించుకొన్నారు. మంత్రులు, అధికారులు ఫోటోలు తీయించుకొన్నారు. వాస్తవంగా చూస్తే మాత్రం రైతు లోగిళ్ల‌లో మృత్యు ఘంటిక‌లు మోగుతున్నాయి.

సాగుకి సెల‌వు ఇస్తున్న రైతాంగం
వాస్త‌వానికి జూన్ నెల మొద‌టి వారంలోనే రైతులంతా వ్య‌వ‌సాయ ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉండాలి. కానీ స‌మయానికి పెట్టుబ‌డులు దొరికే పరిస్థితి లేదు. రుణ‌మాఫీ మోసంతో బ్యాంకుల్లో అడుగు పెట్టే ప‌రిస్థితి లేదు. గ‌త ఏడాది 56వేల కోట్ల మేర వ్య‌వ‌సాయ రుణాలు ఇవ్వాల్సి ఉండ‌గా కేవ‌లం 7వేల కోట్లు మాత్ర‌మే రైతుల చేతి దాకా వెళ్లింది. మిగిలింది కొంత మేర కాగిత‌పు లెక్క‌ల్లో స‌రిపెట్ట‌గా, చాలా వ‌ర‌కు బ్యాంకులు రుణాలు ఇవ్వ‌ని ప‌రిస్థితి. అంటే మిగిలిన మేర అంతా రైతులు ప్రైవేటు వ‌డ్డీ వ్యాపారుల నుంచి అప్పుగా తెచ్చుకొన్న‌ది. ఈ బాధ భ‌రించ‌లేక చాలా మంది వ్య‌వ‌సాయానికి స్వ‌స్తి ప‌లికారు. గోదావ‌రి జిల్లాల్లోని కోన‌సీమ లో అయితే ఐదు మండ‌లాల రైతులు క్రాప్ హాలీడే ప్ర‌క‌టించేశారు.

రైతుల ఆత్మ‌హ‌త్య‌లు
అటు జూన్ నెల మొద‌లైన 22 రోజుల్లోనే 12 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్నారు. స‌గ‌టున ప్ర‌తీ 40 గంట‌ల‌కు ఒక ఆంధ్ర రైతు ఆత్మ‌హ‌త్య చేసుకొంటున్నాడు. ఖ‌రీఫ్ మొద‌లైన తొలినాళ్ల‌లోనే మృత్యుఘంటిక‌లు మోగుతున్నాయి. అయినా స‌రే, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం లో రైతులు చాలా సంతోషంగా ఉన్నార‌ని మంత్రులు, టీడీపీ నేత‌లు బాజా వాయించుకొంటున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌చారం చేసుకొంటున్నారు

శాస్త్రీయ ప‌రిశీల‌న క‌రువు
వాస్త‌వంగా రైతుల అవ‌స‌రాలు గ‌మ‌నించేందుకు చేయాల్సిన క‌నీస ప్ర‌ణాళిక ప్ర‌భుత్వంలో క‌రువు అయింది. ఏటా జ‌ర‌గాల్సిన ఇరిగేష‌న్ అడ్వ‌యిజ‌రీ మండ‌లి స‌మావేశాలు జ‌ర‌గ‌టం లేదు. నీటి అవ‌స‌రాల మీద శాస్త్రీయ‌మైన మ‌దింపు క‌ర‌వు అయింది. అటువంట‌ప్పుడు రైతుల అవ‌స‌రాలు తీర్చే మార్గం క‌నిపించ‌టం లేదు. కేవ‌లం కంటి తుడుపుచ‌ర్య‌గా మాత్ర‌మే ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌చ్చ మీడియాలో ప్ర‌చారం బాగా జ‌రుగుతోంద‌న్న ధీమాతో నాయ‌కులు కాలం వెళ్ల‌దీస్తున్నారు త‌ప్పితే వాస్త‌వ ప‌రిస్థితుల మీద దృష్టి పెట్ట‌డంలేదు. రైతు లోకం క‌డుపు మండుతోంద‌న్న వాస్త‌వ ధృక్ప‌థం క‌రువు అయ్యింది. అందుకే రైతుల‌కు ఉసురు పెడుతూనే కానుక‌లు ఇచ్చామ‌ని డ‌ప్పు కొట్టుకొంటోందీ ప్ర‌భుత్వం. 

తాజా వీడియోలు

Back to Top