గుంటూరు: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఈ నేపథ్యంలో కార్యకర్త కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా నిలిచింది. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. అనంతరం, పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘సింగయ్య వైయస్ఆర్‌సీపీ కార్యకర్త. వైయస్ జగన్ అభిమాని. వైయస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైయస్ జగన్.. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతుని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసింది. వైయస్ జగన్ పర్యటనలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు. వాటిపై న్యాయపోరాటం చేస్తాం. కానీ, వైయస్ఆర్‌సీపీ నాయకుల్ని గాని కార్యకర్తలు గాని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. వైయస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు. మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘సింగయ్య వైయస్ఆర్‌సీపీకి కరుడుగట్టిన కార్యకర్త. ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైయస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. వైయస్ జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది. పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్‌లో చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది’ అని చెప్పారు.