వినాశకారుడి విపరీత బుద్ధులు

– హత్యలు, అరాచకాలతో అట్టుడుకుతున్న రాష్ట్రం
– బాబు పాలనలో ఖాకీలకే రక్షణ కరువు
– అభివృద్ధికి వ్యతిరేకి..పచ్చి అవకాశవాది చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌లో పచ్చ పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అధికారం అడ్డం పెట్టుకుని అన్ని వ్యవస్థల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. పచ్చ చొక్కా వేసుకుంటే చాలు పెత్తనం చేతికొచ్చినట్టుగా రెచ్చిపోతూ రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నారు. వీరు చేస్తున్న అన్యాయాలను ఎదురిస్తే హత్యలకు పూనుకుంటున్నారు.   ఇంత జరుగుతున్నా ఏ మీడియా నోరెత్తదు. పైగా చంద్రబాబును ఓ శాంతి కాముకుడిలా బుద్ధుడి కజిన్‌ బ్రదర్‌లా కీర్తిస్తూ బాబు పాపంలో మీడియా పాలు పంచుకుంటోంది. 

 అధికారం చేతిలో ఉన్నోడికి రూల్స్‌తో పనిలేదని.. అధికార పార్టీ నాయకులు చెప్పిందే శాసనమని.. పచ్చ చొక్కాలు బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ దొరల ఆగడాలకు ఒక వర్గం కాదు.. ఒక ప్రాంతం కాదు.. ఒక జిల్లా కాదు.. అన్ని వర్గాల ప్రజలు.. అన్ని ప్రాంతాలవారు నరకం చూస్తున్నారు. నీతులు చెప్పేది వారే.. తప్పులు చేసేదీ వారే. చట్టాలు చేసేదీ వారే అదే చట్టాలను అధికారం అండదండలతో అపహాస్యం చేసేదీ వారే. 
          
– నిద్ర లేచింది మొదలు పడుకునే దాకా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ను అవినీతి పరుడని గొంతులు చించుకుని బురదజల్లుతారు.  కానీ వారి పార్టీలోనే ఉన్నఅసలు దొంగలు సుజనా చౌదరి, గంటా శ్రీనివాస్‌లను మాత్రం కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగా కొనసాగిస్తారు.
– శాంతి భద్రతల గురించి గంటల కొద్దీ చంద్రబాబు ఉపన్యాసాలు ఇస్తారు. తహసీల్దార్‌ వనజాక్షిని తమ పార్టీ ఎమ్మెల్యే జుట్టు పట్టి లాగినా చర్యలు తీసుకోడు. 
– చట్టాలను రక్షించే పోలీసులను పార్టీ ఎమ్మెల్యేలు చెప్పులతో కొడతారు.. కాలితో తంతారు.. ఐపీఎస్‌ అని కూడా చూడకుండా నడిరోడ్డు మీద గల్లా పట్టుకుని బెదిరిస్తారు. 
– నీతి నిజాయతీలకు తానే నిలువెత్తు సాక్ష్యంగా ప్రకటించుకుంటాడు. పక్క రాష్ట్రంలో తన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళితే అన్యాయమనట . అదే పని ఆయన చేస్తే నీతి, నిప్పు అని మాట్లాడతాడు. 
– ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా తానింకా నిప్పునని బుకాయిస్తాడు. కేసీఆర్‌కి భయపడి రాష్ట్రం విడిచి పరిగెత్తుకొస్తాడు. 
– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూరగాయల ధరలు పెరిగాయని మెడలో కూరగాయల దండేసుకుని దీక్షకు దిగుతాడు. కానీ ఆయన హయాంలో లక్షల కోట్లు దోపిడీ జరుగుతున్నా ప్రశ్నించిన వారిని అభివృద్ధి నిరోధకలని ముద్రేసి ప్రచారం చేస్తాడు. 
– తన అవసరాల కోసం.. అధికారం చేపట్టడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించి  చేసి చూపిస్తానని బీరాలు పలుకుతాడు. పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించక రైతులు పంటను తగలేసుకుంటుంటే మాత్రం తనకేమీ పట్టనట్టు అమెరికా వెళ్తాడు. 
– మూడేళ్లలో ప్రధాని మోడీని ఆయన 49 సార్లు కలిస్తే తప్పులేదు.. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కసారి కలిసినా అదేదో క్షమించరాని నేరంగా అల్లాడిపోతాడు. అమెరికా పర్యటన కూడా మధ్యలోనే వదిలేసి పరిగెత్తుకొస్తాడు. 
– ప్రతిపక్ష నాయకుడు ఐదు నిమిషాలు అసెంబ్లీలో టాయ్‌లెట్‌కు పోయినా రాద్ధాంతం చేస్తారు.. ఆయన మాత్రం మీడియాకు చెప్పకుండా ఆరు గంటలు ఎక్కడికైనా వెళ్లోచ్చు. కుటుంబంతో కలిసి ఏ దేశానికి వెళ్లామో కూడా చెప్పకుండా విదేశీ పర్యటనలు చేయెచ్చు. 
– ఎన్నికల ముందిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే ప్రజలను రెచ్చగొడుతున్నారని అంటారు. ఆధారాలతో సహా హామీల సంగతేంటని అడిగితే అక్రమ  కేసులు పెడతారు. 
– ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జలయజ్ఞం లాంటి మహత్తర కార్యక్రమాన్ని ధనయజ్ఞం అంటారు. హంద్రీనీవా, వంశధార ఫేజ్‌–2 లాంటి కొద్దిపాటి పనులను మూడేళ్లయినా పూర్తిచేయరు. ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచి అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెడతారు. 
– ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా చేస్తామని ప్రచారం చేసుకుంటారు. ఐదు నుంచి పది శాతం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడానికి మనసు రాదు. 
– పోలవరం పూర్తి చేయడానికే తనను దేవుడు పుట్టించాడని సొల్లు కబుర్లు చెబుతాడు. 1996లోనే పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు పనులను అధికారం చేతిలో ఉన్న నిర్లక్ష్యం చేస్తాడు. వైయస్‌ భగీరధుడిగా మారి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే అడ్డుకునేందుకు కోర్టులకెళతాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రాజెక్టు  అంచనాలు పెంచేయడం.. రోడ్డేయడం కూడా చేతకాని అసమర్థ కంపెనీలకు ప్రాజెక్టు పనులు కట్టబెడతాడు. 
ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పూర్తి విరుద్దం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు పచ్చి అవకాశవాది. అధికారం కోసం వెంపర్లాట.. కులాలను, ప్రాంతాలను, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి విడదీయడం ఆయన నైజం. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top