దళితులను అవమానిస్తున్న చంద్రబాబు

చట్టాలకు తిలోదకాలు
కళ్లులేని కబోదులుగా టీడీపీ దళిత నేతలు

ఏలూరుః
వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున టీడీపీ ప్రభుత్వంపై
నిప్పులు చెరిగారు. చంద్రబాబు సీఎం అయ్యాక దళితులపై దాడులు పెరిగాయని,
చట్టాలను సరిగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో
ప్రభుత్వం, ముఖ్యమంత్రి పనితీరు రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసేవిధంగా
ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చట్టాలకు తిలోదకాలిస్తూ,
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో
మునుపెన్నడూ లేనివిధంగా  వైఎస్సార్సీపీ డా.బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద
దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహిస్తుందని నాగార్జున చెప్పారు. 

దళితులకు
రాజ్యాంగ బద్ధంగా జనాభా ప్రాతిపదికన రావాల్సిన వాటా రావడం లేదని, సబ్
ప్లాన్ నిధులు సరిగా ఖర్చుచేయడం లేదని నాగార్జున ప్రభుత్వంపై విమర్శలు
గుప్పించారు. ఇక గంగిరెడ్డి విషయాన్ని వైఎస్ జగన్ కు ముడిపెడుతూ జూపూడి
ప్రభాకర్ నీచంగా మాట్లాడుతున్నాడని నాగార్జున ఫైరయ్యారు. దళితులను మోసం
చేసి చంద్రబాబుకు కాళ్లకు చెప్పులు తొడుగుతున్న జూపూడి నోరు అదుపులో
పెట్టుకోవాలని హెచ్చరించారు.

దళితులకు చట్ట
ప్రకారం రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయకుండానే మంత్రి పీతల సుజాత
ఏవేవో మాట్లాడుతున్నారని నాగార్జున విరుచుకుపడ్డారు. చేతనైతే దళితులకు
రావాల్సిన వాటా గురించి చంద్రబాబు కాలర్ పట్టుకొని నిలదీయాలని టీడీపీ దళిత
నేతలకు సవాల్ విసిరారు. చంద్రబాబు దళితులకు వ్యతిరేకంగా జీవో 25, 43, 79
లను తీసుకొచ్చి వారిని నిరాశ్రయులను చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
 దళిత శాసనసభ్యులు, మంత్రులు కళ్లు లేని కబోదుల్లాగా మారారని దుయ్యబట్టారు.
Back to Top