బాబు స్టీల్ ప్లాంట్ రాజకీయం


చంద్రబాబు రాజకీయ చదరంగంలో ప్రజల ఆశలే పావులు. ఎన్నో ఏళ్లుగా రాయలసీమ వాసులు ఎదురు చూస్తున్న కడప ఉక్కు ఫ్యాక్టరీపైనా బాబు తన మార్కు రాజకీయాలను ప్రయోగిస్తున్నాడు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం నుంచి అనుమతులు సాధించకుండా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి ప్రజలు ప్రశ్నించగానే దీక్షల పాట పాడుతున్నాడు. ఆయన బినామీలతో దొంగ దీక్షలు చేయించి అభాసు పాలయ్యాడు. ప్రత్యేక హోదా కోసం, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహారదీక్షలు బరువు తగ్గడానికంటూ ఆ పార్టీ నాయకులు చేసిన వెకిలి చేష్టలను ప్రజలంతా గమనించారు. పది రోజుల నిరాహారదీక్షలకు రోజుకో కోటి ఖర్చుపెట్టిన చంద్రబాబు ఘనతను పదే పదే చెప్పుకున్నారు. పావు గ్రాము కూడా బరువుతగ్గని పార్లమెంటు సభ్యుడి ప్రగల్బాలు విని నవ్వుకున్నారు. ఇంతకీ చంద్రబాబు కడపలో ఆరంభిస్తామని చెబుతున్న స్టీలు ఫ్యాక్టరీ ఎప్పుడు మొదలై ఎప్పుడూ పూర్తి అవుతుంది? కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రమే నిర్మించగలిగితే దానికి ఐదేళ్లకాలయాపన ఎందుకు చేసారు? సొంతంగా ఇంత పెద్ద పరిశ్రమను స్థాపించగల స్థాయి ఉన్న రాష్ట్రం అని దేశం అంతా అనుకున్నాక ఇక రాష్ట్రం పేదదని, కష్టాల్లో ఉందని ఏడిచి మొత్తుకున్నా కేంద్రం పట్టించుకుంటుందా? దుబారాల కోసం దొంగ దీక్షలకోసం పూటకో కోటి ఖర్చు చేస్తున్నందుకే కేంద్రంలోని మోది సర్కార్ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులన్నిటికీ గండి కొట్టింది. అసలు కడప స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి సమగ్ర  కార్యాచరణ ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయబోతున్న సంస్థలు ఏవి? ఏ పద్ధతిలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పరిశ్రమకు పునాది వేస్తున్నారు? ఇవన్నీ బేతాళ ప్రశ్నలే. వీటికి చంద్రబాబు సమాధానం ఇవ్వడు. 
కడపలో స్టీలు ప్లాంట్ కు పునాది రాయి వేసి జాతికి అంకితం చేయడం, దాన్ని ఎన్నికల్లో అస్త్రంగా వాడుకోవడం ఇది మాత్రమే చంద్రబాబు చేసే పని. ‘’అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పునాదిరాయి వేస్తోంది సిఎం రమేష్ కు అడ్డంగా ఉన్న గడ్డం తీసేందుకు సాయం చేయడానికేమోంలేదంటే ఈ పునాదిరాయి కూడా అంత త్వరగా ఎలా పడుతుందీ’’ అని డౌట్లు వ్యక్తం చేస్తున్నారు తెలుగు ప్రజలు. 

 
Back to Top