నిరుద్యోగులకు బాబు మోసం

నాలుగున్నరేళ్ల చంద్రబాబు
పాలన నిరుద్యోగులకు నిరాశను, ఆగ్రహాన్ని తప్ప ఏమీ అందించలేదు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు
తన మేథావితనం, తన 40 ఏళ్ల అనుభవాన్ని సాకుగా చూపి ఓట్లు దండుకున్నాడు. అధికారంలోకి వచ్చిన
తర్వాతఆ నమ్మకాన్ని వమ్ము చేసి నిరుద్యోగుల పాలిట మరణ శాసనం రాసాడు చంద్రబాబు.

బాబొస్తే జాబొస్తుందన్నారు

ఎన్నికల వేళ చంద్రబాబు
నోటికొచ్చిన అబద్ధాలు ఆడాడు. పంచ్ లైన్లతో యూత్ ని బాగానే పడగొట్టాడు. జాబు కావాలంటే బాబు
రావాలంటూ ప్రచారం హోరెత్తించాడు. ప్రగల్బాలు పలికాడు. తీరా బాబు వచ్చాక జాబు లేదు. కనుచూపు మేరలోజాబుల జాడే లేదు.

కోట్లరూపాయిల పెట్టుబడులు
లక్షలాది ఉద్యోగాలు

చంద్రబాబు వస్తే పరిశ్రమలు
పరిగెత్తుకుంటూ ఏపీకి వస్తాయని నమ్మబలికారు. అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, ఉపాధికి కొరత ఉండదని
ఊదర కొట్టారు. ఐటి సెక్టార్, పెట్రోలియం, పోర్టులు, విమానాశ్రయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, దేశీయ, విదేశీ కంపెనీలు అంటూ కళ్ల ముందు త్రిశంకు స్వర్గాన్ని
చూపించారు. విదేశాలకు ప్రయాణం చేసినప్పుడల్లా ఎపికి రావడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయంటూ
కబుర్లు చెప్పారు. తీరా చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూసాక కానీ నిరుద్యోగులకు అర్థం కాలేదు...బాబుది మాటల గారిడీ...చేతల్లో అంతా బురిడీ
అని.

నోటిఫికేషన్లు ప్రభుత్వ
పోస్టులు

టిడిపి ప్రభుత్వం రాగానే
నిరుద్యోగుల ఆశల తీరేలా నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నాడు చంద్రబాబు. ఇప్పటి వరకూ రెండో డీఎస్సీ
కూడా జరగలేదు. టెట్ డిఎస్సీల మధ్య షటిల్ ఆటలు ఆడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. వేలాది పోస్టులు మూలుగుతుండగా
కనీసం సగం పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు చంద్రబాబు ప్రభుత్వం. బాబు పాలనలో నేడు రేపూ
అంటూ నాన్చిన రెండో డీఎస్సీ నికూడా ఇప్పుడు మళ్లీ వాయిదా అంటున్నారు. ప్రభుత్వ సంస్థల్లోని
ఉద్యోగాలకు కోతపెడుతూ, ఆ స్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నింపుతూ కాలం
గడిపేస్తున్నాడు చంద్రబాబు. బాబొస్తే జాబు రావడం కాదు. ఉన్న పోస్టులు, ప్రభుత్వోద్యాగాలు మాయం
అయిపోతాయని మరోసారి నిరూపించాడు. తాజాగా విద్యుత్ సంస్థలో ఏఈ పోస్టుల భర్తీ అని ప్రకటించి, చివరకు తుస్సుమనిపించాడు. సొంత వారు నడుపుతున్న
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు మేలు చేసేందుకు, నిరుద్యోగులకు నామం పెడుతున్నాడు చంద్రబాబు.

నిరుద్యోగభృతి

ఉద్యోగం వచ్చే వరకూ
నాది బాధ్యత, ఎవ్వరూ మీ కుటుంబాల పై ఆధారపడకుండా మీకు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తా
అన్న చంద్రబాబు నాలుగేళ్ల పాటు ఆ మాటే ఎత్తలేదు. ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఎంత మొత్తుకున్నావినిపించుకోనట్టు నటిస్తూ, పట్టించుకోకుండా తప్పుకుపోతూ
నాలుగేళ్లు గడిపేసాడు. ఇక 2019 ఎన్నికల శంఖారావం వినిపించగానే చంద్రబాబుకు హఠాత్తుగా
నిరుద్యోగ భృతి గుర్తొచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు,  సవాలక్ష కొర్రీలతో, సగంమందిని ఫిల్టర్
చేసి, ఇస్తానన్న 2000లో సగం కోసేసి 1000 రూపాయిలు మాత్రం భృతి ఇస్తానంటున్నాడు. ఇందులోనూ తెలుగు తమ్ముళ్లకే
ప్రాధాన్యం అని వేరుగా చెప్పక్కర్లేదు.

చంద్రబాబు పాలనలో నిరుద్యోగులకు
ఆత్మహత్యలే గతి అవుతున్నాయని ఆగ్రహిస్తూ గుంటూరులో భారీ ర్యాలీ చేపట్టారు నిరుద్యోగ
యువత. బాబొచ్చాడు కానీ జాబులేవంటూ కలెక్టరేట్ ముందు ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రం వ్యవస్థలను
నిర్వీర్యం చేస్తోందంటూ దేశమంతా తిరుగుతున్న తెలుగుదేశం అధినేత, సొంత రాష్ట్రంలో తన
పాలనలో యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నాడన్న విషయం ప్రంపచానికి తెలుసన్నారు నిరుద్యోగులు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది
పోస్టులు ఖాళీగా పడిఉంటే వాటిని భర్తీ చేయకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. చిరుజీతాలకు ఔట్ సోర్సింగ్
వారితో పని చేయించుకుని, ఉద్యోగ భద్రత లేకుండా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న
చంద్రబాబుకు నిరుద్యోగులే బుద్ధిచెప్పడం తథ్యం అంటున్నారు. 

Back to Top