చంద్రబాబు దిగజారుడు రాజకీయం


సరైన వాడు సింహం లా ఎదురు నిలిచి పోరాడుతాడు. 
చేతకానివాడు గుంట నక్కలా జిత్తులమారి వేశాలేసి గెలవాలనుకుంటాడు.
ఇక్కడ సింహం ఎవరో గుంట నక్క ఎవరో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. 

ఏపీలో 2019 ఎన్నికల నగారా మ్రోగనుంది. అధికార టీడీపీ నాలుగున్నర సంవత్సరాల పాలన వారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తుందని ఆ పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కింది స్థాయి కార్యకర్త నుండి మొదలుకొని ముఖ్యమంత్రి వరకూ అందరికీ ఈ వాస్తవం అర్ధం అయ్యింది. అందుకే బాబు ఎన్నికల్లో గెలిచేందుకు దిగజారుడు రాజకీయాలకు సిధ్దపడ్డాడు. ప్రత్యర్థి పార్టీ ప్రజల్లో బలంగా ఉందని, ఎన్నికల్లో తలపడి ఆ పార్టీ తో గెలవడం అసాధ్యమని ముఖ్య మంత్రి డాష్ బోర్డు బల్ల గుద్ది మరీ చెబుతోంది. అబద్దాల అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఓట్లు అడగలేడు కనుక ఓట్లను తొలగించేస్తున్నాడు.  ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరులను ఎంచుకుని మరీ ఓట్లను మాయం చేస్తున్నాడు. 
మనుషుల్ని దించి...
ఊరూరా కొందరు వ్యక్తులు సర్వే పేరుతో తిరుగుతుంటారు. వీరంతా చంద్రబాబు నియమించిన అన్ అఫిషయల్ ఉద్యోగులు. ఇంటింటికీ తిరిగి ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారో వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందించడమే వీరి పని. సర్వే అంటూ వచ్చిన వారు ఇంట్లో ఎందరుంటారు? ఏం చేస్తారు? ఏ పార్టీ కి ఓట్లు వేస్తారు? వారి ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ నెంబరు వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారం అంతా ముఖ్యమంత్రిగారి పర్సనల్ డాష్ బోర్డుకు చేరుతోంది. టీడీపీ కి వ్యతిరేకత ఏమాత్రం కనిపించినా వారి ఓటు క్షణాల్లో గల్లంతు ఐపోతోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అనిచెప్పుకునే చంద్రబాబు చివరికి ఎన్నికల్లో గెలవలేక దొడ్డి దారి పట్టాడు. జిత్తులమారి ప్లాన్లతో గెలవాలనుకుంటున్నాడు. 
ఐతే చంద్రబాబు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి..గతం లో జాతి మీడియాను అడ్డుపెట్టుకుని, తననొక అభినవ అభివృద్ధి పితామహుడిగా కీర్తింప చేసుకుని, కిరీటాలు పెట్టించుకుని, ప్రజలను మోసపుచ్చి గెలిచాడు. కానీ ఇప్పుడలాంటి ప్రచారాలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా వేయికళ్ల పహారా కాస్తోంది. బాబు అబద్దాలు చిటికెలో బట్ట బయలు చేస్తోంది. బాబు అవినీతి గుట్టు రట్టు చేస్తోంది. 2014 ఎన్నికల్లో అలవికాని హామీలు, విభజన సమయం లోని సెంటిమెంట్, బాబు ప్రచారం చేసుకున్న అనుభవజ్ఞుడు ముద్ర, కుల సమీకరణాలు బాబును ఒడ్డున పడేసాయ్. కానీ ఇప్పుడా పాచికలు పారవ్. బాబు అసమర్థత అందరికీ అర్ధం ఐయ్యింది. ప్రతిపక్ష పార్టీ కి చెందిన ఓట్లను కాజేస్తూ అడ్డంగా దొరికిన బాబు ap ప్రజల దృష్టిలో మరింత దిగజారిపోయాడు. ఓటుకు నోటులో పట్టుబడి పారిపోయి రావడం, విశ్వ రాజధాని అని చెప్పి ఒక్క నిర్మాణమూ చేయక పోవడం, బలవంతపు భూ సేకరణ, ప్రచార ఆర్భాటం ఇవన్నీ బాబు నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచాయ్. ఇక ఓట్లు మాయం చేసినా ఓటర్లనే మాయ చేసినా ప్రయోజనం లేదు. బాబు ఓటమికి ముహూర్తం ఖారారైంది.


Back to Top