భయోత్పాతంలో చంద్ర‌బాబు



– సీబీఐ పేరెత్తితే ఉలిక్కిపాటు
– ఆర్థిక నేరాలు, ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం  భయట‌పడుతుందనే భయం
– తప్పులమీద తప్పులతో రాష్ట్రం పరువుతీస్తున్న ముఖ్యమంత్రి


వ్యవస్థలను దశలవారీగా పతనం చేసిన చంద్రబాబు నాయుడు.. ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక దిగజారుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుల మీద తప్పులు చేస్తూ తన పతనానికి తానే రూట్‌ మ్యాప్‌ గీసుకుంటున్నాడు. అర్థంపర్థం లేని జీవోలతో ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలను దుర్వినియోగపరుస్తూ.. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడు. తన స్వార్థ రాజకీయాల కోసం.. కేసుల నుంచి బయటపడే మార్గాన్వేషణలో చంద్రబాబు చివరికి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే తన పార్టీ ఎంపీ సీఎం రమేశ్, అతడి అనుచరుడు సాన సతీష్‌ పుణ్యమా అని స్వతంత్ర దర్యాప్తు అయిన సీబీఐని ఛీబీఐ అనే స్థాయికి దిగజార్చిన చంద్రబాబు అండ్‌ కో.. తమ మీద దర్యాప్తులు జరుగబోతున్నాయని ఉప్పందుకుని సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు అప్రకటిత కృత్రియ యుద్ధాన్ని సృష్టిస్తున్నారు. భజన మీడియా వెనక దాక్కుని చంద్రబాబు కట్టు కథలు అల్లి జనాల మీద రుద్దాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. 
కేసులకు భయపడి 
ఒక తప్పుకు భయపడి ఇంకో తప్పు.. దానిని కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పుడు జీవోలు.. ఇలా ఒక్కొక్కటిగా తప్పుడు జీవోలు జారీ చేస్తూ ప్రజలను చంద్రబాబు అయోమయానికి గురిచేస్తున్నాడు. ప్రజలను మోసగించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ వికటించడంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు, దేశ అత్యున్నత స్థానాలు కూడా తాను అనుకున్నట్టే నడవాలనే నియంత పాలనకు చంద్రబాబు తెగబడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే కాంగ్రెస్‌తో పొత్తు కట్టానని చెప్పుకునే చంద్రబాబు వర్షన్‌లో సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకపోవడమే కాబోలు. నోరు తెరిస్తే వేమన సూక్తులు వినిపించి తాను బ్రహ్మగారిలాగా కాలజ్ఞానం చదివే చంద్రబాబుకు తన భవిష్యత్తు బోధపడినట్టుంది. తాను చేసిన ఆర్థిక నేరాలు, ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం వంటి కుట్రలు,  ఎమ్మెల్యేల ఫిరాయింపులకు చేసిన ఓటుకు నోటు వ్యవహారం, ప్రాజెక్టుల్లో దోపిడీ, అగ్రిగోల్డ్‌ వ్యవహారం, బ్యాంకు అకౌంట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఒక భారీ కుంభకోణమే జరిగిందనేది ఓపెన్‌ సీక్రెట్‌. 
తన మీద చిన్నకేసు పెట్టినా, ఆరోపణ వచ్చినా, పిట్టీ కేసులో నోటీసులొచ్చినా.. తెలుగు జాతి ప్రమాదంలో పడినట్టు బిల్డప్‌ ఇవ్వడం చంద్రబాబుకు అలవాటే. తన ప్రభుత్వాన్ని అస్థర పరడానికి కుట్రలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సానుభూతి కలిగేలా మాట్లాడటం.. అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రాయించడం.. హడావుడిగా పోరాటాలు, దీక్షలు గుర్తొచ్చి.. జనం ముందుకెళ్లి కాపాడమని అర్థించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ఇదే చంద్రబాబు సమస్యల మీద తనను వచ్చే ప్రజలకు మాత్రం కనీస మర్యాద కూడా ఇచ్చిన పాపాన పోలేదు. 
అప్పట్లో కీర్తించాడు..
అంతా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు సీబీఐకి భుజకీర్తులు తగిలించాడు. ఇప్పుడు అదే సీబీఐ తన మీద వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చడానికి సోదాలు చేస్తుంటే మాత్రం.. గిలగిలా కొట్టుకుంటున్నాడు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీటికీ మాటికీ సీబీఐ దర్యాప్తులకు ఆదేశించమని డిమాండ్‌ చేసిన చంద్రబాబు... ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటే.. సీబీఐ రాష్ట్రానికి రావడం కుదరదంటున్నాడు.  ఔటర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారం, పరిటాల రవి హత్య, వోక్స్‌వ్యాగన్‌ కుంభకోణాలు వంటివన్నీ చంద్రబాబు కోరితే.. వైఎస్సార్‌ ఆదేశించిన సీబీఐ దర్యాప్తులేనని చంద్రబాబుకు గుర్తులేకపోవడం బాధాకరం.. 

తాజా వీడియోలు

Back to Top