<strong>() ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ప్రాధాన్యం</strong><strong>() అడుగడుగునా ప్రతిపక్ష నాయకుడి ప్రసంగానికి అంతరాయం</strong><strong>() ప్రభుత్వ పక్షానికే మైక్ అప్పగింత</strong>హైదరాబాద్) శాసనసభలో ముఖ్యమైన అంశాల్ని పక్కకు మళ్లించేందుకు ప్రభుత్వం రక రకాల మార్గాలు వెదకుతోంది. ఇందులో భాగంగా జల వనరుల సంరక్షణ మీద చర్చను చేపట్టి సాగదీసుకొంటూ వెళ్లారు. మానవాళి శ్రేయస్సు కు సంబంధించిన అంశం కాబట్టి ఇందులో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నించినప్పటికీ, అక్కడ కూడా విపక్షం గొంతు నొక్కేందుకే ప్రాధాన్యం ఇచ్చారు.వరల్డ్ వాటర్ డే సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఇందులో నీటిని కాపాడుకొనే విధానాల గురించి మాట్లాడుతూ, ఈ దిశగా తాము చేపడుతున్న చర్యలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. తర్వాత ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి వాస్తవాలు చెప్పటం ప్రారంభించారు. ఆ వెంటనే మైక్‌ను కట్ చేశారు. అధికార పక్షానికి మైక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా బాగా మాట్లాడారని, ఆయన నీటి సంరక్షణ గురించి ఎంతో చేస్తున్నారని, ఆయన పరిపాలన సూపర్ అంటూ భజన పర్వాన్ని సాగించారు. దీని మీద ఎక్కడా అభ్యంతరం వ్యక్తం కాలేదు.తిరిగి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మైక్ తీసుకొన్నారు. నీటి సంరక్షణ ఆవశ్యకతను చెబుతూనే ప్రాజెక్టుల విషయంలో చేసిన డ్యామేజీ గురించి ప్రస్తావించారు. వెంటనే మైక్ కట్ అయింది. అదే వాదనలు రిపీట్ అయ్యాయి. చివర్లో మైక్ తీసుకొని కొన్ని వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశారు. వెంటనే మైక్ కట్ చేసి, నీటి సంరక్షణకు సంబంధించిన ప్రతిన... అందరిచేత చెప్పించి సభను శనివారంకు వాయిదా వేసుకొన్నారు.