బాబు గురువింద నీతి

– తన పై ఆరోపణలపై ప్రత్యర్థులపైకి విసిరి సంబరం
– మీడియాను అడ్డం పెట్టుకుని బురదజల్లే ప్రయత్నం


‘విభజన హామీలన్నీ నెరవేరుస్తారని మోడీ నాలుగేళ్లు నమ్మించి చివరికి మోసం చేశారని ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని సమయం వస్తే మోసం చేసిన వారిని ఆంధ్రా ప్రజలు వదిలి పెట్టరని హెచ్చరిస్తున్నా..’
కాకినాడ ధర్మపోరాట దీక్షలో మోడీని చంద్రబాబు హెచ్చరించారు. 

‘ఆయన మాటల్లో మేటి. పనుల్లో చురుకుదనం లేదు. దారుణంగా మోసం చేశాడు. హామీలను నిలబెట్టుకోలేదు. ఆయనకు బుద్ధి చెప్పాలి..’ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై చంద్రబాబుకు అంత శీతకన్ను దేనికి..? కేంద్ర ప్రభుత్వానికి సభ నుంచే ఖబడ్డార్‌ అంటూ హెచ్చరికలు పంపారు. 

ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమిటి అని ఆత్మావలోకనం చేసుకుంటే.. మాటలు, మోసాలు.. అసత్య ప్రచారాలు తప్ప ఏమీ లేదు. రాజధాని నిర్మాణం ఒక మోసం, పోలవరం ప్రాజెక్టు ఓ అక్రమాల పుట్ట.., ఇసుక తవ్వకాలు, భూ కుంభకోణాలు, సెక్స్‌ రాకెట్, ఆడవారిపై అరాచకాలు, దోపిడీలు ఇలా చెప్పుకుంటూ పోతే బాబు పాలనతో రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతూనే ఉంది. సింగపూర్, జపాన్, మలేసియా, దుబాయ్‌ ఆఖరికి కొలంబో పేరు చెప్పి రాజధాని నిర్మాణం ముసుగులో విదేశాలు తిరిగొచ్చాడే తప్ప నాలుగు ఇటుకలు పేర్చిన పాపాన పోలేదు. పైగా తన చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ మీద నెపం నెట్టేసి పబ్బం గుడపుకుంటున్నాడు. అనుకూల మీడియా అండతో ఇవ్వని ఉద్యోగాలు, కట్టని నిర్మాణాలు, రాని కంపెనీల గురించి నోరు నొప్పి లేకుండా చెప్పి జనాన్ని ఊహా లోకంలో విహరింపజేయిస్తున్నారు. ఎన్నికలకు ముందు వెంకన్న దేవుడి సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన బాబు.. ఇప్పుడు ఆయన ఆభరణాలనే నిలువునా దోచేసుకునే వరకు వచ్చాడంటే నాలుగేళ్ల బాబు పాలన ఎంత ఘోరంగా ఉందో చెప్పొచ్చు. అయితే గురువింద నీతి మాదిరి చంద్రబాబు తన మీద వస్తున్న ఇన్ని అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వాటినే పక్క వారి మీద ప్రయోగించి సంబర పడిపోతున్నారు. పైగా వెంకన్న పేరు చెప్పి దేవుడు మోసం చేసిన వారిని క్షమించడు అంటూ మెంటల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగుతున్నాడు. 
ఇక హామీల సంగతి సరే సరి. రుణమాఫీలు, కులాల వారీగా సవాలక్ష హామీలు.. వాటిల్లో దేన్నైనా చెప్పింది చెప్పినట్టుగా చేసిన చరిత్ర ఉందా చంద్రబాబుకు? మోడీ ఏపీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదని వాపోతున్న చంద్రబాబు నాయుడు తను చెప్పిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నాడో ఆత్మపరిశీలన చేసుకోగలడా? అంత ధైర్యముందా? ఎంతసేపూ ఆత్మస్తుతి, పరనిందనే. తను ఏం చెప్పినా జనాలు నమ్ముతారు, వాళ్లు నమ్మే వరకూ అబద్ధాలనే పదే పదే చెప్పాలి అనేది చంద్రబాబు రాజకీయ వ్యూహం.
తండ్రికంటే తానేమీ తక్కువ తినలేదన్నట్టు మోడీ మీద ఒంటికాలితో లేచాడు. మోడీ ఆంధ్రా ప్రజలను వెన్నుపోటు పొడిచాడని.. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా మోడీ మారలేదని.. మండిపడ్డాడు. తెలుగు జాతితో పెట్టుకోవద్దని తీవ్రంగా విమర్శించాడు. వెన్నుపోటు హక్కులు తన తండ్రికి మాత్రమే ఉంటే మోడీ ఏ విధంగా వాడుకుంటాడని ఈయన బాధ కావచ్చు. 
Back to Top