36 గంటల దీక్ష పేరుతో బాబు కొంగ జపం

తుని జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

తూర్పు గోదావ‌రి: 36 గంట‌ల దీక్ష పేరుతో చంద్ర‌బాబు కొంగ జ‌పం  మొదటు పెట్టారని, కొంగ దీక్షలు చేస్తూ ఎవరిని మోసం చేస్తారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్ర‌శ్నించారు.  తుని పట్టణంలో నియోజకవర్గ ఎంపిటిసిలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి జనాగ్రహ దీక్షలో  ప్రభుత్వ విప్, గౌరవ శాసనసభ్యులు  దాడిశెట్టి రాజా పాల్గొని ప్ర‌సంగించారు. బూతులు సమర్థిస్తూ చంద్రబాబు దీక్షలు చేస్తున్నారా అని, ఈ దీక్ష ఎవరి కోసమని నిలదీశారు. ప్రజలు ఆరాధించే గొప్ప మనిషిని బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనాగ్రహ దీక్షను చేపట్టారు. అదే విధంగా, మండపేట కలువ పువ్వు సెంటర్ లో వైయ‌స్సార్సీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు,మున్సిపల్ చైర్మన్ నూక దుర్గా రాణి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top