మీకు సత్తా లేదు.. సర్దుకోండి బాబూ

మోసమనే పదానికి సింబల్‌ చంద్రబాబు

వైయస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తే టీడీపీ నేతల ప్యాంట్లు తడిసిపోతాయి

నిన్ను నమ్మం బాబు అని టీడీపీ ఎమ్మెల్యేలే అంటున్నారు

జననేత గురించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత నందిగం సురేష్‌

హైదరాబాద్‌: చంద్రబాబు మోసం అనే పదానికి సింబల్‌ లాంటివాడని, ప్రపంచం మొత్తం సర్వే చేసినా  చంద్రబాబును మించిన మోసగాడు చూద్దామన్నా కనిపించడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత నందిగం సురేష్‌ అన్నారు. అనుభవం అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు 70 ఏళ్లలో మోసగాడిగా అపార అనుభవం సాధించాడన్నారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు, ఆయన మంత్రులు అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన భాష మార్చుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

– చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తిలా చంద్రబాబు మాట్లాడడం లేదు. చంద్రబాబు నుంచి కింది కార్యకర్తల వరకు అందరిదీ నీచమైన భాష వాడుతున్నారు. 

– వైయస్‌ జగన్‌పై చంద్రబాబు కామెంట్‌ చేయడం సిగ్గుచేటు. 

– దేశంలోని ప్రతి సబ్జెక్ట్‌పై పట్టున్న వ్యక్తి వైయస్‌ జగన్‌. అసెంబ్లీలో వైయస్‌ జగన్‌ మాట్లాడితే ప్యాంట్లు తడుపుకునే పరిస్థితి. సమాధానం చెప్పలేక మైకులు కట్‌ చేయడం, ఇంతకు మించి చంద్రబాబు సాధించింది ఏముంది. 

– చంద్రబాబు రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయాడు. రాజకీయంగా ఎంత దిగజారారో ప్రజలకు తెలుసు. 

– వైయస్‌ఆర్‌ సీపీ నిన్ను నమ్మం బాబు అని కార్యక్రమం మొదలు పెడితే.. దానికి చంద్రబాబు నిన్ను నమ్మాం అని పోస్టర్‌ పెట్టుకోవడం హాస్యాస్పదం. 

– ఇచ్ఛాపురం నుంచి యుద్ధం మొదలైంది. మరి ఎక్కడ వరకు ఆగుతుందో తెలియదు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు లోటస్‌పాండ్‌కు వస్తున్నారంటే చంద్రబాబు ఎంత దిగజారిపోయారో ఆలోచించుకోవాలి. 

– ప్రజలే కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుపై పూర్తి అవగాహనకు వచ్చి నిన్ను నమ్మం బాబు అంటున్నారు.  

– కుళ్లు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, మనుషులు చనిపోయిన చోట కూడా రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు. 

– పార్టీలోకి వచ్చే నాయకులతో వైయస్‌ జగన్‌ రాజీనామాలు చేయించి చేర్చుకుంటున్నారు. చంద్రబాబులా అక్రమంగా చేర్చుకోలేదు. 

– వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని వలసలు మొదలయ్యాయి. ఈ నెల చివరి వరకు వలసలు చూసి చంద్రబాబు మానసిక ధైర్యం కోల్పోతాడు. 

– రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు..ఇక చాలు వెళ్లండి.

–చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఆయనకు వయసైపోయింది. 2014లో 600 చిల్లర హామీలు ఇచ్చారు. అధికారం కోసం ఏది పడితే అది మాట్లాడారు.

–ఇప్పుడు తిరిగి అధికారం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పథకాలు అన్ని కాపీ కొట్టారు. ఈ విషయం ప్రజలకు తెలిసిపోయింది.

– టీడీపీ నుంచి అందరు వెళ్లిపోవడం చూసి ప్రస్టేషన్‌లో ఉన్నారు. అందుకే అయోమయానికి గురవుతున్నారు. టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను నమ్మం బాబూ

 దిగిపో అనే పరిస్థితి రాబోతుంది.

– ఇక సర్దుకోండి. 2019లో ప్రజలు బట్టలూడదీసి కొడతారు. జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాలోకంకి ఆ సత్తా లేదు కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది.

–చంద్రబాబు తన సామాజిక వర్గానికి తప్ప మిగిలినవారందరికి అన్యాయం చేస్తున్నారని 

ఆయన వద్ద ఉన్న నేతలే చెబుతున్నారు.

–చంద్రబాబు నేను మారాను. నాకు ఓట్లేయండి అని గతంలో అడిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.

–చంద్రబాబుకు మీడియా మేనేజ్‌ మెంట్‌ తప్ప మరోటి తెలియదు.

 

తాజా వీడియోలు

Back to Top