పూర్ణ, ఆనంద్‌లకు వైయస్‌ జగన్‌ అభినందన

హైదరాబాద్ :

చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలుగు విద్యార్థులు పూర్ణ, అనంద్‌లకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే గురుకులాలలో చదువుతున్న వీరిద్దరూ చిన్నతనం నుంచే గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశం మొత్తం గర్వపడేలా అద్భుతం సాధించారని శ్రీ జగన్‌ కొనియాడారు. ఎవరెస్టు శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస దేశానికే వన్నె తెచ్చారని ఆయన శ్లాఘించారు. భవిష్యత్తులో వీరు మరెన్నో లక్ష్యాలు సాధించాలని, పూర్ణ, ఆనంద్‌లు మరెందరికో స్ఫూర్తిదాతలని పేర్కొన్నారు. ఈ విద్యార్థులను తీర్చిదిద్దిన తల్లిదండ్రులు, గురువులకు కూడా శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Back to Top