‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో?

‘‘నిజం’’ చెప్పులు తొడుక్కునే లోపు ‘‘అబద్ధం’’ పరారైపోయింది..

పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు.. నోటీసులకు స్పందించడు..

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయిసాయిరెడ్డి

హైదరాబాద్: పరారీలో లేనంటాడు అంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు. పోలీసులు,చట్టాలు,కోర్టులు తనంతటి ప్రవక్తను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడని పేర్కొన్నారు. బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘‘మీడియా నయీం’’ను ఏ ‘‘బాబు’’ రక్షిస్తాడో చూడాలంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం పరారైపోయిందని, విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవి ప్రకాశ్‌ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే రాత్రికి రాత్రి దొడ్డిదారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేశాడని పేర్కొన్నారు. రేపో,మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో అంటూ చల్లోక్తులు విసిరారు 

Back to Top