<strong>హైదరాబాద్, 12 నవంబర్ 2012:</strong> దీపావళి పండుగ ప్రజలందరి జీవితాలలో సరికొత్త వెలుగులు నింపాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆకాంక్షించారు. దీపావళి అంటేనే తిమిరంపై సమరం అని ఆమె పేర్కొన్నారు. అన్యాయాల మీద న్యాయం, దుర్మార్గంపై ధర్మం సాధించిన విజయానికి దీపావళి పండుగ ప్రతీక అని అభివర్ణించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని విజయమ్మ రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ సోమవారంనాడు ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.