27 నుంచి వైయస్ జగ‌న్ సమైక్య శంఖారావం

‌హైదరాబాద్, 22 డిసెంబర్ 2013:

చిత్తూరు జిల్లా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మలి విడత సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభిస్తారు. ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ జగన్ పలమనేరులోని 4 రోడ్‌ క్రాస్‌కు ‌చేరుకుని అక్కడి నుంచి సమైక్య శంఖారావం యాత్రను పునఃప్రారంబిస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురామ్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

పలమనేరు నుంచి పత్తికొండ చేరుకుని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని రఘురామ్‌ తెలిపారు. అనంతరం నక్కపల్లి చేరుకుని మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి అప్పినపల్లిలో ఓదార్పు కార్యక్రమం నిర్వహిస్తారు.

మరుసటి రోజు 28న మండల కేంద్రమైన రాయలపేటలో బహిరంగ సభ, కమ్మపాలెంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రికి మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి నివాసంలో బసచేస్తారని తలశిల రఘురామ్‌ తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top