స్పీకర్‌: శ్రీమతి వాసిరెడ్డిపద్మ-మే 25,2012

జగన్‌మోహన్‌రెడ్డి గారు సీబీఐ విచారణకు హజరైన కొంతసేపటి నుండి భయటికిప్రసారం అవుతున్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి కొంత మందికి.

జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడంలేదని అనే విధంగా సీబీఐ ఏమి ప్రశ్నలు జగన్‌మోహన్‌రెడ్డి గారిని అడుతుందొ దగ్గరవుండి చూసినట్టుగా, సీబీఐ అధికారులు సమాచారం అందించినట్టుగా వార్తలు ప్రసారంచేయడం చాల దురదృష్టకరం. 
జగన్‌మోహన్‌రెడ్డిగారు సీబీఐకి సహకరించడంలేదు అనే వార్తలను కనీసం సీబీఐ ఖండించడంలేదు. ప్రసారం అవుతున్నా వార్తల మీద అవునని కాని కాదని కాని చెప్పడంలేదు కొన్ని జిల్లాలలో  జగన్‌మోహన్‌రెడ్డి ని అరెస్ట్‌చేస్తారని కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అటువంటివారికి విజ్ఞప్తి జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఎమి కాదు మనసు కుదుటపరుచుకోండి. అలాగే మీడియా వారు కూడ సంయమనం పాటించాలి. జగన్‌మోహనరెడ్డి గారు మీద ఎటువంటి అబాండాలు వేయడానికి అయినా కాంగ్రెస్‌ నాయకులు వెనుకాడడంలేదు. జగన్‌మోహన్‌రెడ్డి గారు సీబీఐకి వివరణలు ఇస్తున్న సమయంలో బోత్స సత్యనారాయణ గారు కాని లగడపాటి గారు గాని మాట్లాడుతున్నాతీరు చూస్తుంటే  గంగవెర్రులెత్తుతున్నారు.తమకు సంబందించిన ఎమ్మెల్యేలు తమ చేతిలో ఉండే పరిస్ధితిలేదు జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద ఎటువంటి చర్యకు పాల్పడినా వాళ్ళ వైపు ఉండే ఎమ్మెల్యేలు కూడ ఎవరు మిగలరు అని తెలియచేస్తున్నాం.

రాజశేఖరరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని అవమానించే విధంగా ఈరోజు లగడపాటి మాట్లాడుతున్నారు.ఆయనకు తగిన గుణపాఠం  చెబుతాం.

తాజా వీడియోలు

Back to Top