ఉప ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన ఇంటర్వూని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే బాద్యత తన భుజానవేసుకున్న తీరుకనిపిస్తుంది.ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మకే ఉప ఎన్నికల్లో ఓడించారు. చంద్రబాబు ఎవరో చెబితే అవిశ్యాసతీర్మానం పెట్టనని అంటున్నారు, దాని అంతటా అది పడిపోతే తప్పా అంటున్నారు. టీడీపీ ప్రమేయంలేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది.టీడీపీకి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతామని ప్రజల్లోకి వెళ్ళలేక కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతుంది. ఉప ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడ టీడీపీ కాంగ్రెస్‌ను ఒక్క మాటకూడ అనలేదు. అసలు ఈ రాష్ట్రంలో పాలన ఉందా అని ప్రజలు అడుగుతున్నారు. కాంగ్రెస్‌పాలన బావుంది కాంగ్రెస్ కే సపోర్టు చేస్తామంటే ఆ విషయం స్పష్టంగా చెప్పండి.వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి మీద గెలిచింది అని చంద్రబాబు అంటున్నారు. అసలు సానుభూతి ఎందుకు వచ్చింది,దేనికి వచ్చింది, అందురుకలిసి జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద అంబాడాలు వేసి అణగదోక్కడానికి ప్రయత్నిస్తున్నారుజగన్‌మోహన్‌రెడ్డి గారి మీద దాడికి దిగితే అందుకుసానుభూతి వచ్చింది. సానుభూతి పనిచేసింది అంటే మీరందరు దోషులు అవుతారు జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని నమ్మారు. చంద్రబాబు పాలనలో అధికారులు రైతులు అందరు కంటతడిపెట్టారు, కంటతడిపెట్టించారు.ఓదార్పుయాత్ర మొదటినుండి జగన్‌మోహన్‌రెడ్డి తాను ఏంచేయగలలో ఏం పనులు చేయగలనో చెప్పారు. చంద్రబాబుకు వెన్నుపోట్లు తెలియవు అంటా దోడ్డిదారిన కాకుండా రాజమార్గంలో ముఖ్యమంత్రి అవుతారట తాను మాట్లాడుతున్నారు.అసలు కుట్రలకి వెన్నుపోట్లుకి,దొడ్డిదారికి సృష్టికర్త చంద్రబాబె. ఓటుబ్యాంక్‌ను కాంగ్రెస్‌కు మళ్ళించడం రాజమార్గమా..? అసలు అవిశ్యాసమంటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుంది.