స్పీకర్‌: ఎమ్‌వీయస్‌ నాగిరెడ్డి - జూన్ 14, 2012

 ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్యారనికి మద్దతు ధర విషయంలో సామాన్య రకానికి 1250 రూపాయలు సైజు రకానికి 1280 రూపాయల మద్దతు ధర నిర్ణయించడం జరిగింది.  ముఖ్యమంత్రికిరణ్‌కుమార్‌ రెడ్డి గారు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు  మద్దతు ధర కల్పించడం లేదు రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది. రాష్ట్రం నుండి 33 మంది ఎయ్‌పీలు ఉన్న రైతుల గురించి పట్టించుకోవడంలేదు. పత్తి రైతులకు అన్యాయం జరిగితే శరద్‌పవార్‌ గారు కేంద్రంతో మాట్లాడి పత్తి రైతుల పక్షాన నిలిచారు. మనకు ఇంత అన్యాయం జరుగుతున్న మన ముఖ్యమంత్రికి పట్టడంలేదు. పంట పండించి ఈరోజురైతులు అప్పులపాలు అవుతున్నారు. రైతులకోసం  చంద్రబాబు కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వ మీద అవిశ్యాస తీర్మానం పెడితే వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ అభిమాన ఎమ్మెల్యేలు రైతులకోసం అవిశ్యాస తీర్మానానికి ఓటు వేశారు. రైతులవిషయంలో ప్రభుత్వం విఫలమైతే ప్రతిపక్షం అయిన రైతాంగ సమస్యలమీద మాట్లాడాలి, కాని చంద్రబాబు కిరణ్‌ తో కలిసి సమస్యలపై స్పందించడంలేదు. దక్షిణబారత దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ . వ్యవసాయం రాజకీయ సమస్యకాదు రైతుల జీవనమరణ సమస్య. పంటలువేసే సమయంలో ప్రభుత్వం ముందు చూపులేకుండా ప్రవర్తిస్తుంది.

Back to Top