స్పీకర్‌: అంబటి రాంబాబు - జూన్ 12, 2012

వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌దే విజయం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తు కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీలు పనిచేసాయి. ఎక్కడ అయితే వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కి మోజారిటి ఓట్లు వస్తాయి అని ముందుగానే ఉహించిన కాంగ్రెస్‌ తెలుగుదేశం నాయకులు 100, 150 ఓట్లు తొలగించారు.అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్‌ పార్టీ విచ్చలవిడిగాచేసింది. నెల్లురులో పార్లమెంట్‌ నియోజక వర్గ పరిదిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డి  బహటంగా కోడ్‌ ఉల్లంగన చేసారు.పోలింగ్‌ జరుగుతున్న ప్రదేశంలో తనకు ఓటు వేయాలని సైగలు చేసారు. పోలింగ్‌ జరుగుతున్న  క్యూలో ప్రజలకు 1000, 2000 రూపాయలు తెలుగుదేశం,కాంగ్రెస్‌ నాయకులు పంచుతున్న పోలీసులు సోద్యంచూస్తు నిలబడ్డారు. కొన్ని ప్రదేశాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని తెలిసిన, టీడీపీ నాయకులు కాంగ్రెస్‌కు ఓట్లు వేయమని అడుగుతున్నారు. కాంగ్రెస్‌ తెలుగుదేశం పార్టీలు రెండు కుమ్మకై  వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ మోజారిటి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి పై దాడికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించడం జరిగింది, మాచర్ల నియోజక వర్గంలో  సాక్షి విలేఖరి ని అందరు తరుముకుంటు వస్తుంటే, విలేఖరి పోలీసులను ఆశ్రయిస్తే డియస్‌సి స్ధాయి అధికారి మాకు సంభందంలేదన్నట్టుగా మాట్లాడారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులను కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్ట్‌చేయడం జరిగింది. అలాగే పరకాల నియోజక వర్గంలో లోకల్‌ పోలీసులను పెట్టి పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కొన్నిచోట్ల ఓటరులకి ఓటరు కార్టు ఉంది కాని లిస్ట్‌లో పేరు లేకుండా చేసారు. తిరుపతిలో క్యూలో ఉన్న ఓటర్లకి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 3 వేల రూపాయలు పంచారు. వైస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేద ప్రజల పార్టీ
Back to Top