స్పీకర్‌: గట్టు రామచంద్రరావు- మే 30,2012

కుట్రలు కుతంత్రాలు ప్రజాభిమానాన్ని ఆపలేవు.
 కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు పెంచడంవల్ల దేశావ్యాప్తంగా ప్రజలపై భారం పడింది, దేశవ్యాప్తంగా నిరసన తేలియచేస్తున్న సంధర్బంగా ఈ నెల 31వ తేదినా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో బాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరసన కార్యక్రమం చేపడుతుంది, ఆ రోజు జరిగే బంద్‌లో వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల అందరు కూడ చురుగ్గా పాల్గోనాలని పిలుపునిస్తున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్‌ చేసినతీరు మీద ప్రజలు కోపంగా ఉన్నారు.చీకటి రోజుగా బావిస్తున్నారు.విజయమ్మగారు ఆందోళనకి దిగితే పోలీసులు బలవంతంగా పోలీస్‌జీప్‌లో పడవేశారు.ఆ కుటుంబం కంటతడిపెడితే కొంత మంది నాయకులు అవాకులుశవాకులు పేలుతున్నారు.కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ తన బలహీనతాలను సహనంగా ప్రకటిస్తున్నారు. విజయమ్మగారు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తే దీటుగా ప్రచారంచేస్తామని రేణుకాచౌదరి అంటున్నారు,దీటుగా ప్రచారం చేయడం అంటే  సోనీయా గాంధీ దీటుగా ప్రచారంచేసి ఎన్ని సీట్లు గెలిపించుకుంది, ఒక నాయకుడు అంటున్నారు జగన్‌మోహన్‌రెడ్డిగారు తన నేరాన్ని అంగీకరించారని, ఈ రోజు కూడ జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద పెట్టిన కేసుగాని, వస్తున్న ఆరోపణలుగాని అవి ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు.  తనమీద వచ్చిన ఆరోపణలని జగన్‌మోహన్‌రెడ్డిగారి మీదకు నెడుతుంది. ప్రభుత్వంలో 26 జీఒలు వచ్చాయి ఆ 26 జీఒల ద్వారా లబ్ది పోందిని వాళ్ళు పెట్టుబడి మరో రూపంలో పెట్టారు అని, ముందు ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణల మీద  సమాదానం చెప్పాలి. బొత్స సత్యనారాయణగారు మాట్లాడుతూ విజమయ్మగారు ప్రజల్లో తిరిగితే ఏహ్యబావం వస్తుందని అంటున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు రాజమండ్రిలో ఆయన పాదయాత్రలో ఆరోగ్యంబాగాలేక రెస్ట్‌తీసుకుంటే అప్పుడు వేరే పనిమీద వచ్చిన సోనియాగాంధీని ఎయిర్‌ పోర్టులోనే కొణతాలరామకృష్టగారు,ద్రోణంరాజు సత్యనారాయణగారు ఇద్దరు కలిసి అమ్మా కాంగ్రెస్‌ నాయకుడుగా ఉన్న రాజశేఖరరెడ్డి గారిని కనీసం ఫోన్లో పరామర్శించండి అంటే పలకరించకుండా పోయినచరిత్ర సోనియాగాంధీ. కాంగ్రెస్‌ నాయకులు తెలుగుదేశం నాయకులు ఇద్దరు కలిసి నెల రోజులు కష్టపడి పెట్టిన రాని  జనం విజయమ్మగారికి ఒక్క రోజులో వచ్చారు.కాంగ్రెస్‌, తెలుగుదేశం నాయకులకి చమటలు పడుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిగారికి ఇన్ని ఆస్తులు ఎక్కడివి అని తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్యరరావు గారు మాట్లాడుతున్నారు.నామా నాగేశ్వరరావువీళ్ళందు పేదవారా,  సీయం రమేష్‌, సుజనాచౌదరి రాజ్యసభ సీటునే అధ్యక్షుడి దగ్గర కొనుక్కున్న చరిత్ర సీయం రమేష్‌కు ఉంది. ఎక్కడో పాల్యంచలో అటెండరుగా బతికిన నామా నాగేశ్యరరావు, ఇప్పుడు కొన్ని వేలకోట్లుకి అధిపతి ఇవాళ. క్యిక్‌ప్రోకోలాగా హెరిటేజ్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టి రాజ్యసభ తీసుకున్న వ్యక్తి నామా నాగేశ్వరరావు. తెలుగుదేశం సీనియర్‌ నాయకులను పక్కన బెట్టి పార్లమెంట్‌కు  మెంబర్‌ అయ్యాడు. చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ అవినీతి పరులు నేరస్తులు అధికారంలోకి వస్తే ఎలా అని అంటున్నారు.జగన్‌గారి గురించి కామెంట్లుచేస్తున్నారు. తెలుగుదేశంలో ఉంటు తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఒక హోటల్లో పెట్టి ఇది ఏంది అని అడగడానికి తెలుగుదేశం అధిపతి అయిన రామారావు గారు వస్తే నీ పక్కన ఉన్న వారి చేత చెప్పులు వేయించిన ఘనతనీదికాదా చంద్రబాబు.....అలాంటి వ్యక్తి నువ్వు కుళ్ళ కుత్రంతాలు గురించి మాట్లాడుతున్నావు. తెలుగుదేశం పార్టీని నందమూరి వారికి ఇచ్చేసి కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తావా అని అడుగుతున్నాం.

Back to Top