స్పీకర్ : గట్టు రామచంద్రరావు -మార్చి8,2012

రాష్ట్రంలో జంటపక్షులుగా ఉన్న చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి అసత్యప్రచారాలతో జగన్ మోహన్ రెడ్డిగారి మెజార్టీని తగ్గించాలని చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల పలితాలు కాంగ్రెస్ కు చెంపపెట్టు  అయినా వాటికి తనకు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. అబద్దాల ప్రచారంలో చంద్రబాబునాయుడు ముందంజలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉపఎన్నికల్లో తమ ఓటమిని ముందుగానే అంగీకరించారు. 3,4 నియోజకవర్గాల్లో తప్ప మేము పోటీఇవ్వడంలేదు అని ఓటమిని అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిగారి మీద మాట్లాడే స్థాయి నాది కాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు మీలాగా ఢిల్లీలో పైరవీలు చేసి పదవులు పొందలేదు ప్రజాభిమానంతో గెలిచాడు. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హతమీకు లేదు అని మేము తెలియచేస్తున్నాం. యూపి సోనియా, రాహుల్ కు కాంగ్రెస్ కు పెట్టనికోటలాంటిది అలాంటి యూపిలో పట్టులేదు గాని ఏపిలో పట్టుందని చెప్తున్నారు ఎలా నమ్మాలి. యూపిలో కంటే ఏపిలో రెండు రెట్లు మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారు.

ఉపఎన్నికల్లో కాంగ్రెస్ టి.డి.పి. ఇద్దరి ఓట్లు కలిసిన వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ  దరిదాపులకురావు అని తెలియచేస్తున్నాం. యూపి ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ముంగిపోయే పడవలాగా ప్రజలకు కనపడుతుంది. జగన్ మోహన్ రెడ్డిని నిలదీయాలని వి.హనుమంతరావు అంటున్నారు. హనుమంతరావు గారిది నోరా లేక మోరా అని నేను అడుగుతున్నాం. రాహుల్గాంధీ గొప్పోడు జగన్ మోహన్ రెడ్డి అవనీతిపరుడు అంటున్నారు. సోనియాగాంధీఆమె చెల్లెలు 20వేల కోట్లు రూపాయల్ని తరలించారని సుబ్రహ్మణ్యం ఆరోపణ చేసారు. అది ఉత్తరప్రదేశ్ ప్రజలునమ్మి వారిని ఓడించారు అదిమీకు  తెలియలేదా అని అడుగుతున్నాం. ములాయంసింగ్ ఉత్తరప్రదేశ్ లో గెలిచారు మేము ఇక్కడ గెలుస్తాం అని చంద్రబాబునాయుడు అనడం హాస్యాస్పదంగా ఉంది. ములాయంసింగ్ సొంతంగా పార్టీ పెట్టి గెలిచిన వ్యక్తి,మీరు మామ దగ్గర పదవిని పార్టీని లాక్కున్న వ్యక్తివి నీవు, అలాంటి నీవు తరుడుఫ్రెంట్లో చక్రం తిప్పుతానంటున్నావు. ఒక వేళ తరుడ్ ఫ్రెంట్ గాని ఏర్పడిత్ చంద్రబాబులేని తరుడ్ ఫ్రెంట్ ఏర్పడుతుంది. రాష్ట్రంలో గెలవలేవుగాని కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్నాడు. నిన్ను ప్రజలే నమ్మలేదు కాబట్టే 2004 లోనే పక్కనబెట్టారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే ఇంట్లో దాన్కున్నాడని ప్రచారం చేశాడు అరెస్ట్ చేసే దమ్మున్న వ్యక్తులురావాలని చాలెంజ్ చేసి ఇంట్లోనే ఉన్నారు కానీ ఎవరూ రాలేదు. ఇలాంటి ప్రచారంచేయడానికి చంద్రబాబునాయుడు గారిది  నోరా తాటిమట్ట అని అడుగుతున్నా, సీపీయం పార్టీ మీ గురించి బాబు జమాన అవనీతిఖజాన పుస్తకాలు ప్రింట్ చేసి ఢిల్లీలో ఎంపిలకు పంచాలేదా ఇప్పుడైనా నిజం ఒప్పుకో నీవుతప్పుచేసావని లేకపోతే సీపీయం తప్పుచేసింది అని  ఒప్పుకో జగన్ మోహన్ రెడ్డి గారిని దొంగ అవనీతిపరుడు అని మరోసారి అన్నావంటే తెలుగుప్రజలు నీ నాలుక చీల్చుతారు అని నేను తెలియచేస్తున్నా.

Back to Top