వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం సీబీఐ రోల్ ఏంటి? సీబీఐ తీరు ఏవిధంగా ఉంది. తెలుగుదేశం, కాంగ్రెస్ లకు ఒక విధమైన న్యాయం... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోకరకమైన న్యాయంగా సీబీఐ ప్రవర్తిస్తుంది. ఇ.యమ్.జి విషయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు హడావిడిగా ఆహోభిలరావుకి భూములు కట్టబెట్టడం ఇ.యమ్.జి కి 250ఎకరాలు ఇచ్చి మరో 250ఎకరాలను ఎలా ఎలాట్ చేశారు.అలాంటి అక్రమాలకూ పాల్పడిన చంద్రబాబు సీబీఐకి కనపడడంలేదా . ప్రభుత్వ భూమిని ని కారుచౌకగా ఇతరులకు కట్టబెట్టలేదా. యమ్ఆర్ కేసులో రంగారావుని నేరస్తునిగా పరిగణించారు.రంగారావు సునీల్ రెడ్డి పేరు చెబితే సునీల్ రెడ్డి గారిని అర్రేస్ట్ చేసి రంగారావుని వదిలిపెట్టారు. జేడి లక్ష్మీనారాయణ పక్షపాత ధోరణిలో తెలుగుదేశంకు వత్తాసు పలుకుతున్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరి డైరక్షన్ లో నడుస్తున్నారు? కేవలం 2 పత్రికల డైరక్షనా ? లేదా మాజీ సీబీఐ డైరెక్టర్ అయిన తెలుగుదేశంపార్టీలో ఉన్న నాయకుడి డైరక్షన్ లో నడుస్తున్నారా ? ఆయన ఎటువంటి వ్యక్తి కేంద్రప్రభుత్వ రహస్యాలను ఇక్కడ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఇచ్చాడు. అసలు లక్ష్మీనారాయణ గారికి తెలుగుదేశం మీద ఎందుకంత ప్రేమ ? సీబీఐ నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించడంలేదు?యమ్ఆర్ ప్రాపర్టీస్ తెసుకొచ్చింది ఎవరు? ఎవరికీ లాభం చేకూర్చడానికి? జగన్ మోహన్ రెడ్డి గారిమీద కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేవలం 24 గంటల్లో జగన్ గారిమీద వారికి సంబంధించిన వారిపైన దాడులు జరిపారు. చంద్రబాబునాయుడు విషయంలో 2 వారాలా దాక జడ్జిమెంట్ కాపీ తీసుకోవడానికి కూడా టైమే లేదు. క్విక్ ప్రోల వల్ల లాభాలు పొందిన కంపెనీలు జగన్ మోహన్ రెడ్డి గారి కంపెనీలలో పెట్టుబడి పెట్టి లాభాలు పొందితే జగన్ మోహన్ రెడ్డి గారిని ఎలా భాద్యుడ్ని చేస్తారు.52నంబెర్ గా జగన్ గారి ఏ 1 ముద్దాయిగా చేస్తారంట, అసలు జీఓలు విడుడలు చేసిన మంత్రులు అధికారులు, ఐఎయస్లు మీద చర్యలు ఎందుకు తీసుకోరు. సీబీఐ ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎఫ్ఐఆర్ లలో మంత్రులను ఎందుకు చేర్చడంలేదు.జేడి లక్ష్మీనారాయణ గారు తమ కుటుంబసభ్యులకు తెలుగుదేశం టిక్కెట్ కావాలని రికెమెండ్ చేసాడంట, ఆ విషయంలో వారి మద్య ఎంత అనుబంధం ఉందో ఆలోచించండి. ఒక సీబీఐ అధికారి తెలుగుదేశంపార్టీ తో గాని,అధినేతతో గాని వారి మద్య అనుబంధం తెలియాలి. రాజశేఖర్ రెడ్డి గారు జీఓ విడుదల చేసి ఐయమ్.జి భూముల విషయంలో చంద్రబాబుపై ఇన్వెస్టిగేషన్ చేయండని లేఖ రాస్తే లక్ష్మీనారాయణ గారు మా దగ్గర స్టాఫ్ లేదు మేము ఆ ఇన్వెస్టిగేషన్ చేయడం కుదరదని అన్నారు. ఈ 26 జీఓలు చట్టబద్దమైనవా కావా ప్రభుత్వం సమాధానం చెప్పాలి, 26 జీఓలు విడుదలచేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?