సోమయాజులు తండ్రి మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 20 అక్టోబర్‌ 2012

: వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డి.ఎ. సోమయాజులు తండ్రి రామారావు (90) మృతి పట్ల పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పితృవియోగం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ సోమయాజులును వారు ఫోన్లో పరామర్శించారు. సోమయాజులు కుటుంబానికి వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో తెలియజేశారు. అనారోగ్యం కారణంగా రామారావు శనివారం ఉదయం మరణించారు.

Back to Top