'అసంతృప్తి మిగిల్చిన టీడీపీ తొమ్మిది నెలల పాలన'

పెనుమూరు: చంద్రబాబునాయుడు తన తొమ్మిది నెలల పాలనలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించడం తప్ప ప్రజలకు ఏమైనా చేశారా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే నారాయణస్వామి ప్రశ్నించారు. చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సోమవారం పెనుమూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్నో హామీలు, వాగ్దానా లు ప్రజలకు ఇచ్చారని చెప్పారు. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయక చేతులు ఎత్తేశారని విమర్శించారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ  పథకాల వల్ల ప్రజలు ఏ మేరకు లబ్ధిపొందారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి బాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు చేస్తుంటే వారిని భయపెట్టడానికి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని సీఎంగా చంద్రబాబు చ రిత్ర సృష్టిస్తారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నీరు- చె ట్టు కార్యక్రమం టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నా రు.

ఈ కార్యక్రమం అమలులో భాగంగా చెరువుల్లో పూడిక తీస్తున్నామని చెప్పి అక్కడి ఇసుకను అక్రమంగా తరలి స్తూ టీడీపీ నేతలు రెండు విధాల సంపాదిస్తున్నారని చెప్పారు. పేదవాడికి రెండు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నెలకు 2 వేల భృతి వంటి హామీలు ఇచ్చి వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు నిరంతరాయం గా తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం మూడు గంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వడం లేదని  చెప్పారు. చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ నీరు- చెట్టు కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. జిల్లాలో తాగునీటికి ప్రజలు ఎన్నో కష్టా లు పడుతున్నారని చెప్పారు. రైతులకు ఎక్కడా సాగునీరు లేక పంటలు సాగు చేయడం మానేస్తున్నారని చెప్పారు. రైతులను, ప్రజలను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
Back to Top